ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోండి
ABN , Publish Date - Sep 04 , 2024 | 11:29 PM
అకాల వర్షాలకు ప్రభు త్వాన్ని నిందిస్తు బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని వనపర్తి మునిసిపల్ చై ర్మన్ పుట్టపాకల మహేష్, సమన్వయకర్త లక్కాకుల సతీష్ మా జీ మంత్రి నిరంజన్‌రెడ్డికి హితవు పలికారు.
- మునిసిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్
వనపర్తి టౌన్, సెప్టెంబరు 4 : అకాల వర్షాలకు ప్రభు త్వాన్ని నిందిస్తు బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని వనపర్తి మునిసిపల్ చై ర్మన్ పుట్టపాకల మహేష్, సమన్వయకర్త లక్కాకుల సతీష్ మా జీ మంత్రి నిరంజన్‌రెడ్డికి హితవు పలికారు. బుధవారం జిల్లా కేంద్రంలోని నందిహిల్స్‌లో గల ఎమ్మెల్యే నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వరదల కారణంగా మృతి చెందిన మృతదేహాలతో కూడా రాజకీయం చేయడం మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డికే చెల్లిందన్నారు. విపత్తు అంటేనే చెప్పి రాదని, ఆ మాత్రం స్పృహ లేకుండా కేవలం ప్రభుత్వాన్ని బద్‌నాం చేయాలనే ఉద్ధేశంతో మాజీ మంత్రి మాట్లాడటం దురదృష్టకరమన్నారు. గతంలో వనపర్తిలో చెరువుల పునరుద్ధరణ పేరుతో భారీ గోతులు చేసింది మీరు కాదా? అని, అలాంటి గోతుల కారణంగా యువకులు నీట మునిగి మరణించినప్పుడు మీరెందుకు హెలికాప్టర్లతో వారిని కాపాడలేకపోయారని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్నా నేటికీ ఇంకా సొంత ఇల్లు లేనివారు, పాత ఇళ్లల్లో నివాసం ఉంటున్నారంటే దీనికి మీ పదేళ్ల పరిపాలననే కారణమన్నారు. వనపర్తిలో వరద సహాయక చర్యల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదేశాల మేరకు ప్రాణాలకు తెగించి సహాయ చర్యలు చేపట్టా మని అన్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నీరు నిలిచి ఇబ్బందిగా మారితే నిమిషాల్లో చర్యలు చేపట్టి పరిష్కరించామని తెలిపారు. రాష్ట్రాన్ని డల్లాస్ సిటీ చేస్తామన్న బీఆర్‌ఎస్ నాయకులు రాష్ట్రాన్ని కల్లాస్ చేశారని మండిపడ్డారు. విపత్తు ఇంకా ముగియకముందే లెక్కలు అడుగుతున్నారంటే మీ ఆలోచన విధానం ఎంత పనిచేస్తుందో మీరే నిర్ణయించుకోవాలని సూచించారు. మీలాగా భూములు కబ్జా చేసే గుణం ఎమ్మెల్యేకు లేదని, త్వరలోనే హైడ్రా తరహాలో జిల్లాలోనూ వాడ్రా వస్తుందని.. అక్రమార్కుల ఆట కట్టించడం, సుద్దపూసలు బండారం బయటపడే తరుణం త్వరలోనే ఉందన్నారు. మాజీ మంతిగ్రా మీ అనుభవాలతో సలహాలు ఇవ్వాలే కానీ ప్రభుత్వంపై, ఎమ్మెల్యేలపై బట్టకాల్చి మీదేసే పనులు ఇకనైనా మానుకుంటే ప్రజలు హర్షిస్తారని హితవు పలికారు. సమావేశంలో కౌన్సిలర్ బాపనిపల్లి వెంకటేష్, జంపన్నయాదవ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సూరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్‌ఐసీ కృష్ణ, సింగోటంనాయుడు, డి.వెంకటేష్ తదితరులున్నారు.