Share News

ఆటో డ్రైవర్లకు జీవన భృతి ఇవ్వాలి

ABN , Publish Date - Jan 29 , 2024 | 11:31 PM

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకటస్వామి డిమాండ్‌ చేశారు.

ఆటో డ్రైవర్లకు జీవన భృతి ఇవ్వాలి
ఆందోళనలో మాట్లాడుతున్న సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి

- సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి

- శాంతినగర్‌లో ఆందోళన

వడ్డేపల్లి, జనవరి 29 : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎ.వెంకటస్వామి డిమాండ్‌ చేశారు. తెలంగాణ పబ్లిక్‌ అండ్‌ ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం శాంతినగర్‌ పట్టణంలో ఆటో డ్రైవర్లతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ప్రతీ నెల రూ.4500 జీవన భృతి ఇవ్వాలని కోరారు. వారికి గుర్తింపు కార్డులివ్వాలని, అడ్టాలకు స్థలాలు కేటాయించాలని, ఇన్య్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం అను సరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెల్యే ఆటో కార్మికులందరూ పాల్గొనాలని కోరారు. ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ ఆటో కార్మికులపై పోలీసుల వేధింపులు తగవన్నారు. వారి ఆందోళనకు యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు తిప్పన్న, కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యాక్షుడు పరంజ్యోతి మద్దతు తెలిపారు. ఆందోళనలో జిల్లా సహాయ కార్యదర్శి మాలిక్‌బాషా, యూనియన్‌ నాయకులు దస్తగిరి, మోహన్‌రావు, రాజు, నరసింహులు, వలి, మారెప్ప, ఎలీసా; ఆశీర్వాదం, హుసేన్‌, జయప్రకాష్‌, నారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 11:31 PM