బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 10:58 PM
బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసి నేరుగా సింగరేణికే కేటాయించాలని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు బాల్‌నర్సింహ, వర్ధం పర్వతాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు బాల్‌నర్సింహ, వర్ధం పర్వతాలు
- వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన
నాగర్‌కర్నూల్ టౌన్, జూలై 5: బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసి నేరుగా సింగరేణికే కేటాయించాలని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు బాల్‌నర్సింహ, వర్ధం పర్వతాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్ర వారం సీపీఐ, సీపీఎం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సింగరేణి బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా జిల్లా కేం ద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థలను వి చ్ఛిన్నం చేసి పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు కుట్ర లు చేస్తోందని, అందులో భాగంగానే సింగరేణి బొగ్గు గ నులను ప్రైవేటుపరం చేయడానికి సిద్ధమైందని ఆరో పించారు. దేశ వ్యా ప్తంగా ఇప్పటికే అనే ప్రాంతాల్లో గనులను ప్రైవేటుకు అప్పగిం చిన మోదీ ప్రభు త్వం తెలంగాణలోని మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి దగ్గర ఉన్న బొగ్గు గనులను వేలం వేయడానికి సి ద్ధమైందని పేర్కొన్నా రు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం ద్వారా దే శంలో నిరుద్యోగాన్ని పెంచి మత విద్వేషాలను రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రశ్నించకపోవడం సిగ్గు చేట్టన్నారు. సీపీఐ రాష్ట్ర నాయకులు హెచ్.ఆ నంద్‌జీ, కేశవులుగౌడ్, నా యకులు కృష్ణాజీ, లక్ష్మీపతి, సురేష్, సీపీఎం నాయకులు ఆర్.శ్రీనివాస్, రామయ్య, అశోక్, అంతటి కాశన్న, మధు, సత్యనారాయణ, శివరాం, సుభాష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.