Share News

ఏఆర్‌ఎస్‌ఐ కుటుంబానికి భద్రత చెక్కు అందజేత

ABN , Publish Date - May 31 , 2024 | 11:30 PM

అనారోగ్యంతో మరణించిన ఏఆర్‌ ఎస్‌ఐ సురేష్‌బాబు కుటుంబ సభ్యులకు శుక్రవారం ఎస్పీ రితిరాజ్‌ ఎనిమిది లక్షల రూపాయల భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కును అందించారు

ఏఆర్‌ఎస్‌ఐ కుటుంబానికి భద్రత చెక్కు అందజేత
బాధిత కుటుంబ సభ్యులకు చెక్కు అందిస్తున్న ఎస్పీ రితిరాజ్‌

అండగా ఉంటాం : ఎస్పీ రితిరాజ్‌

గద్వాల క్రైం, మే 31 : పోలీస్‌ సాయుధ దళ కార్యాలయంలో పనిచేస్తూ, ఈ ఏడాది జనవరిలో అనారోగ్యంతో మరణించిన ఏఆర్‌ ఎస్‌ఐ సురేష్‌బాబు కుటుంబ సభ్యులకు శుక్రవారం ఎస్పీ రితిరాజ్‌ ఎనిమిది లక్షల రూపాయల భద్రత ఎక్స్‌గ్రేషియా చెక్కును అందించారు. పెన్షన్‌, ఇతర ప్రయోజనాలను త్వరగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్‌ నాగేంద్రబాబు, సురేష్‌బాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

పోక్సో కేసులో బాధితురాలికి ‘భరోసా’

పోక్సోకేసు బాధితురాలికి భరోసా తక్షణ సహాయనిధి కింద ఎస్పీ రితిరాజ్‌ రూ. 10వేలు ఆర్ధిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోక్సో, అత్యాచార బాధితులకు పోలీస్‌ శాఖలోని ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భరోసా కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. ఎంతో మంది బాధితులకు భరోసా కేంద్రం అండగా నిలుస్తోందన్నారు. సాంఘికంగా, ఆర్ధికంగా వెనుకబడిన బాధిత కుటుంబాలకు సహాయనిధి ద్వారా ఐదు వేల నుంచి రూ. 10 వేల రూపాయలు తక్షణ పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఒక గ్రామానికి చెందిన పోక్సో బాధితురాలు కుట్టుమిషన్‌ నేర్చుకునేందుకు రూ. 10వేలు ఇచ్చినట్లు తెలిపారు. ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు.

Updated Date - May 31 , 2024 | 11:30 PM