Share News

ఎమ్మెల్సీ కవిత అరెస్టు అక్రమం

ABN , Publish Date - Mar 16 , 2024 | 11:00 PM

ఓ వైపు కోర్టులో కేసు నడుస్తుండగా మరో వైపు ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం సరైంది కాదని, నారాయణపేట బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి ఖండించారు.

ఎమ్మెల్సీ కవిత అరెస్టు అక్రమం
మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి

- బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి

నారాయణపేట టౌన్‌, మార్చి 16 : ఓ వైపు కోర్టులో కేసు నడుస్తుండగా మరో వైపు ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం సరైంది కాదని, నారాయణపేట బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి ఖండించారు. శనివారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా అరెస్టు చేయడం అన్యాయం అన్నారు. అరెస్టు చేయమంటూ సుప్రీం కోర్టుకు మాట ఇచ్చిన తరువాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారన్నారు. సుప్రీం కోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న ఈడీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని హెచ్చరించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను దెబ్బ తీసేందుకే కావాలని బీజేపీ తన అధికారాన్ని ఉపయోగించుకొని అక్రమ అరెస్టులకు పాల్పడుతోందన్నారు. సమావేశంలో కె.సుదర్శన్‌రెడ్డి, గందె చంద్రకాంత్‌, కన్న జగదీష్‌, విజయసాగర్‌, చెన్నారెడ్డి, జోన్నల సుభాష్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 11:00 PM