Share News

కొత్త ఎస్పీల నియామకం

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:19 PM

రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఐఏఎ్‌సలను బదిలీ చేయగా, సోమవారం ఐపీఎ్‌సలను బదిలీ చేసింది.

కొత్త ఎస్పీల నియామకం

మహబూబ్‌నగర్‌కు జానకి ధరావత్‌..

గద్వాలకు టి.శ్రీనివాసరావు

హర్షవర్ధన్‌, రితిరాజ్‌ బదిలీ

మహబూబ్‌నగర్‌/గద్వాల క్రైమ్‌, జూన్‌17: రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఐఏఎ్‌సలను బదిలీ చేయగా, సోమవారం ఐపీఎ్‌సలను బదిలీ చేసింది. అందులో భాగంగానే మహబూబ్‌నగర్‌, గద్వాల ఎస్పీలు హర్షవర్ధన్‌, రితిరాజ్‌ బదిలీ కాగా, వారి స్థానంలో మహబూబ్‌నగర్‌ ఎస్పీగా జానకి ధరావత్‌, జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీగా టి.శ్రీనివాసరావులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జానకి సౌత్‌ ఈస్ట్‌ జోన్‌ డీసీపీగా పని చేస్తుండగా, టి.శ్రీనివాసరావు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీగా పని చేస్తున్నారు. కాగా.. మహబబూబ్‌నగర్‌ ఎస్పీ హర్షవర్ధన్‌ను హైదరాబాద్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోగా, రితిరాజ్‌ను ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌గా నియమించారు.

2007లో డీఎస్పీగా ఎంపిక

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం రోళ్లబండ తండాకు చెందిన జానకి ధరావత్‌ 2007లో గ్రూప్‌ 1లో డీఎస్పీగా ఎంపికయ్యారు. రాజమండ్రి, సిరిసిల్ల, గుంటూరులో డీఎస్పీగా పనిచేశారు. ప్రొబెషనరీ సమయంలో మహబూబ్‌నగర్‌లోనూ పని చేశారు. 2013లో ఐపీఎ్‌సగా సెలెక్ట్‌ అయ్యి.. హైదరాబాద్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా, మల్కాజిగిరి డీసీపీగా పని చేశారు.

Updated Date - Jun 17 , 2024 | 11:19 PM