Share News

అపూర్వ సమ్మేళనం

ABN , Publish Date - Oct 20 , 2024 | 10:48 PM

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో 1989-90 బ్యాచ్‌ విద్యార్థులు ఆదివారం చదువు కున్న పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు.

అపూర్వ సమ్మేళనం
ఉపాధ్యాయులను సన్మానించిన పూర్వ విద్యార్థులు

మానవపాడు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో 1989-90 బ్యాచ్‌ విద్యార్థులు ఆదివారం చదువు కున్న పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ నాటి ఉపాధ్యాయులు హాజ రయ్యారు. ఈ సందర్భంగా పదో తరగతి చదువుకున్న పాఠశాలలో మళ్లీ 35 సంవత్సరాల అనంతరం ఇలా అందరం కలుసుకోవడం సంతో షంగా ఉందన్నారు. పాఠశాల ప్రాంగణానికి వస్తే ఆ నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మహ్మద్‌అలీ, గోవర్ధన్‌రెడ్డి, వీరన్న, రవీందర్‌రెడ్డి, మదిలేటి ఉన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 10:48 PM