Share News

అపూర్వ సమ్మేళనం

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:07 PM

పాఠశాల స్థాయి ముగిసిన 20 సంవత్సరాల తరువాత ఎక్కడెక్కడో స్థిరపడిన స్నేహితులంతా ఒక్క సారిగా అందరు కలుసుకోవడం నూతన ఉత్సాహన్ని కలిగించింది.

అపూర్వ సమ్మేళనం
నారాయణపేటలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఉపాధ్యాయులను సన్మానించిన పూర్వ విద్యార్థులు

కోస్గి, జూన్‌ 9 : పాఠశాల స్థాయి ముగిసిన 20 సంవత్సరాల తరువాత ఎక్కడెక్కడో స్థిరపడిన స్నేహితులంతా ఒక్క సారిగా అందరు కలుసుకోవడం నూతన ఉత్సాహన్ని కలిగించింది. ఆదివారం పట్టణంలోని ఏబీకే ఫంక్షన్‌ హల్‌లో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం అట్టహాసంగా సాగింది. పట్టణం లోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో 2003-04 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు కలుసుకొని తమ ఉపాధ్యాయులతో కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసు కున్నారు. అనంతరం తమకు విద్యా బోధన చేసిన ఆనాటి ఉపాధ్యాయులను సన్మానించారు.

నారాయణపేట టౌన్‌ : నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆదివారం 1996-97 బ్యాచ్‌ పదో తరగతి విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను ప్రత్యేకంగా ఆహ్వానించి శాలువా, పూలమాలతో ఘనంగా సత్క రించారు. ఈ సందర్భంగా బాల్య దశలోని విషయా లను గుర్తు చేసుకున్నారు. తాము పదో తరగతి చదువుకునే రోజుల్లో వందశాతం ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. అనంతరం తమ వృత్తి, కుటుంబ వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాస్కర్‌రెడ్డి, రాఘవేంద్రచారి, పాండు రంగారెడ్డి, సుధీర్‌ ఎడ్కే, నారాయణరెడ్డి, వీరణ్ణ, గంగాధర్‌, శశిధర్‌, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2024 | 11:07 PM