విభిన్న రూపాల్లో అమ్మవారు
ABN , Publish Date - Oct 03 , 2024 | 11:18 PM
ఆశ్వ యిజ శుద్ధ పాడ్యమి నుంచి విజయదశమి వరకు తొమ్మిది రోజుల పాటు సాగే దేవీ శరన్నవరాత్రి ఉత్స వాలు గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమ య్యాయి.
జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
తొలి రోజు బాలా త్రిపురసుందరీ దేవిగా వాసవీ కన్యకా పరమేశ్వరి
మహాలక్ష్మీ దేవిగా జములమ్మ
గద్వాల టౌన్/ గద్వాల/ వడ్డేపల్లి/ మల్దకల్/ మానవపాడు/ అయిజ/ ఉండవల్లి, అక్టోబరు 3 : ఆశ్వ యిజ శుద్ధ పాడ్యమి నుంచి విజయదశమి వరకు తొమ్మిది రోజుల పాటు సాగే దేవీ శరన్నవరాత్రి ఉత్స వాలు గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమ య్యాయి. గద్వాల పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆల యంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ధ్వజా రోహణం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అంతకు ముందు వాసవీమాత ఉత్సవమూర్తిని సంఘం అధ్యక్షు డు ఆలూరు బిలకంటి రాము ఇంటి నుంచి ఆల యానికి ఊరేగింపుగా తీసుకెళ్లి పూజలు చేశారు. భక్త మార్కండేయ, కాళికాదేవి, అన్నపూర్ణ ఆలయాలల్లో అమ్మవారు బాలాత్రిపుర సుందరీ దేవిగా పూజలందు కున్నారు. భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయం, పాండురంగ శివాలయాల్లో శైలపుత్రీదేవిగా, కన్యకా పరమేశ్శరి, తాయమ్మ ఆలయాల్లో వారాహిదేవిగా, అంబాభవానీ ఆలయంలో అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. నడిగడ్డలో వెలిసిన జములమ్మ ఆలయంలో అమ్మవారు మహా లక్ష్మీదేవి అలంక రణలో భక్తుల పూజలందుకున్నారు.
- వడ్డేపల్లి మునిసిపాలిటీ పరిధిలోని పైపాడులో వాల్మీకీ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గమ్మ, శాంతినగర్ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో అమ్మవారు తొలిరోజు బాలాత్రిపుర సుందరీదేవి అలం కరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు రావూరి సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
- మల్దకల్ మండల కేంద్రంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి, ఆదిశిలా క్షేత్రంలో లక్ష్మీదేవి అమ్మ వార్లు బాలా త్రిపురసుందరీ దేవి అలంకరణలో భక్తుల పూజలందుకున్నారు.
- మానవపాడు మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారు బాలా త్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
- అయిజ పట్టణంలోని కన్యకాపరమేశ్వరి, అంబా భవానీ ఆలయాల్లో అమ్మవారు బాలా త్రిపురసుందరీ దేవిగా, కాళికామాత ఆలయంలో స్వర్ణకవచాలంకృతా దేవిగా భక్తుల పూజలందుకున్నారు.
- ఉండవల్లి అనసూయమ్మ కాలనీ, గాంధీనగర్, కంచుపాడు, మైరాపురం గ్రామాల్లో ప్రతిష్ఠించిన దుర్గా మాత బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చారు.
- ఇటిక్యాల మండలంలోని పెద్దదిన్నె లక్ష్మీవెంకటేశ్వర ఆలయంలో స్వామికి క్షీరాభిషేకం చేశారు. ఆలయ చైర్మన్ జయసింహ, అర్చకుడు వెంకటేష్ పాల్గొన్నారు.