Share News

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Apr 02 , 2024 | 10:48 PM

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని ఏర్పాటు చేయాలి

నారాయణపేట టౌన్‌, ఏప్రిల్‌ 2 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో ఆయా గ్రామాల మహిళా సంఘం అధ్యక్షురాలు, పాఠశాల హెచ్‌ఎం, ప్రతీ తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లులతో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఇకపై పాఠశాలల్లో జరిగే సివిల్‌ వర్క్స్‌ అన్ని కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ తీర్మానంతోనే కొనసాగుతాయన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో వీసీ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలే పాఠశాల నిర్వహణను పర్యవేక్షస్తాయన్నారు. ఆయా కమిటీలు రూ.25 వేల వ్యయం వరకు సివిల్‌ పనులు చేయవచ్చని, రూ.లక్ష వరకు చేసే పనులకు ఎంపీడీవో, లక్ష దాటిన పనులకు తాను అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. ముఖ్యంగా పాఠశాలలో కిటికీలు, తలుపులు, ఎలక్ర్టిసిటీ స్వీచ్‌ బోర్డులు, ఫ్యాన్లు, మరుగుదొడ్ల తాత్కాలిక మరమ్మతులు కమిటీ ద్వారా కొనసాగుతాయన్నారు. అలాగే పాఠశాల నిర్మాణంపై అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఎప్పటికప్పుడు సమీ క్షిస్తుందన్నారు. ఈ ఏడాది జూన్‌ 13లోపు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చేయాల్సిన మరమ్మతు పనులకు సంబంధించిన ఎస్టిమెంట్లను మూడు రోజుల్లో ఇవ్వాలని కలెక్టర్‌ పంచాయతీరాజ్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఈవో అబ్దుల్‌ ఘనీ, డీఆర్డీవో రాజేశ్వరి, సంబంధిత అధికారులు పా

Updated Date - Apr 02 , 2024 | 10:48 PM