పాఠశాలకు పూర్వ విద్యార్థుల చేయూత
ABN , Publish Date - Oct 20 , 2024 | 11:29 PM
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బేసి క్ ప్రాక్టీసింగ్ ఉన్నత పాఠశాలలో 1978-1979 లో పదో తరగతి చదివిన పూర్వపు విద్యార్థులు పాఠశాలలో రూ.లక్షా 10వేల వ్యయంతో నిర్మా ణం స్టేజీనిర్మాణం చేశారు.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బేసి క్ ప్రాక్టీసింగ్ ఉన్నత పాఠశాలలో 1978-1979 లో పదో తరగతి చదివిన పూర్వపు విద్యార్థులు పాఠశాలలో రూ.లక్షా 10వేల వ్యయంతో నిర్మా ణం స్టేజీనిర్మాణం చేశారు. దీన్ని ఆదివారం పాఠ శాల ప్రధానోపాధ్యాయుడు విజయకుమార్ ప్రా రంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు కృషి చేయడం అభినందనీయం అన్నారు. అంద రూ కలిసి వచ్చే ఏడాది నాటికి షెడ్డు పూర్తిచేసి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గంగాధర్‌గుప్త, శ్రీధర్, నల్లమద్ది సురేందర్‌రెడ్డి, మహమ్మద్, సర్ధార్ ఠాకుర్, అజం నందసింగ్ , తిరుపతి రెడ్డి , భాను ప్రకాష్‌రావు, జగన్‌మోహన్‌రావు, కృష్ణయ్య, విశ్వేశ్వర్, రవిస్వా మి, సాయిబాబా, లక్ష్మీనారాయణ, పుష్పలత, హేమలత తదితరులు పాల్గొన్నారు.