Share News

అన్ని కార్యక్రమాలు వెబ్‌సైట్‌లో పొందుపరచాలి

ABN , Publish Date - Mar 11 , 2024 | 10:45 PM

ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా వాటి ఫొటోలను జిల్లా వెబ్‌సైట్‌లో పొందుపరచాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు.

అన్ని కార్యక్రమాలు వెబ్‌సైట్‌లో పొందుపరచాలి
కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

- అధికారుల సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

నారాయణపేట టౌన్‌, మార్చి 11 : ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా వాటి ఫొటోలను జిల్లా వెబ్‌సైట్‌లో పొందుపరచాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హల్‌లో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నారాయణపేట జిల్లాకు సంబంధించి అధికార వెబ్‌సైట్‌ను అప్‌డెట్‌ చేయాలని, ఆర్టీఐ చట్టం కింద వచ్చిన దరఖాస్తులను క్లియర్‌ చేయాలని, హైదరాబాద్‌ నుంచి వచ్చే ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించి ఎండార్స్‌ చేసి కలెక్టర్‌ట్‌కు పంపాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు ఎపిక్స్‌ ఇవ్వాలని, ఉత్తమ పంచాయతీ అవార్డు కోసం ఆన్‌లైన్‌లో వివరాలను జిల్లా పంచాయతీ అదికారికి పంపాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో ఏవో నర్సింగ్‌రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పుర కార్యాలయం తనిఖీ

నారాయణపేట పుర కార్యాలయాన్ని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్‌ తనిఖీ చేసిన సమయంలో కార్యాలయంలో ఒకరిద్దరు ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, అటెండర్లు తప్ప వివిధ సెక్షన్లలోని అధికారులు, ఉద్యోగులు లేకుండా పోయారు. కలెక్టర్‌ హాజరు రిజిస్టర్‌తో పాటు బయోమెట్రిక్‌ హాజరు యంత్రాన్ని పరిశీలించారు. ముందస్తు సమాచారం లేకుండా కార్యాలయానికి హాజరు కాని అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి సంబంధించి రెండు రోజుల వేతనాన్ని నిలిపి వేయాలని ఆదేశించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కౌంటర్‌ను ఎవరు నిర్వహిస్తున్నారని ఆరా తీశారు. కార్యాలయంలోని వివిధ విభాగాలను కలెక్టర్‌ పరిశీలించి అధికారులు నిర్వహిస్తున్న విధుల గురించి ఆరా తీశారు. కమిషనర్‌ 13వ తేది వరకు సెలవు పెట్టారని సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు.

బాల్య వివాహాలు లేని గ్రామాలుగా మార్చాలి

మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలోని ఐసీడీఎస్‌, ఐసీపీఎస్‌, డీహెచ్‌ఈడబ్ల్యూ, చైల్డ్‌ హెల్ఫ్‌ లైన్‌ విభాగాల ఉద్యోగ సిబ్బంది సమన్వయంతో పనిచేసి, జిల్లాలో బాల్య వివాహాలు లేని గ్రామాలు గా మార్చాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌ లో బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ టీం సమావేశంలో కలెక్టర్‌ పాల్గొని, మాట్లాడారు. జిల్లాలో బడి బయట ఉన్న సుమారు రెండు వేల బాలికలకు సంబంధిం చి సమాచారాన్ని సేకరించి వారి వివరాలతో కూడిన జాబితాను తయారు చేయాలన్నారు. జిల్లాలో ఏ ర్పాటు చేసిన 324 బాలిక మండలి కమిటీల సమా వేశాలను ఎజెండాతో నిర్వహించాలన్నారు. గ్రామా లు, మండలాల వారిగా సమావేశం నిర్వహించి బా ల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలని సూ చించారు. జిల్లాలో జరిగే పెళ్లీళ్లు రిజిస్ట్రేషన్‌ తప్పని సరిగా చేసుకునేలా అవగాహన కల్పించాలని, ఆధా ర్‌ కేంద్రాల్లో వయసు పెంచి ఆధార్‌ కార్డు జారీ చే యకుండా నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చే యాలని సమన్వయకర్త వెంకటేశ్వర్లు కలెక్టర్‌ను కోరారు. అందుకు కలెక్టర్‌ సానుకూలంగా స్పందిం చారు. సమావేశంలో డీడబ్ల్యూవో నరసింహా రావు, ఐసీపీఎస్‌ కవిత, కరిష్మా, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 10:45 PM