ఐలమ్మ జీవితం మహిళా లోకానికి ఆదర్శప్రాయం
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:14 PM
భూమి, భుక్తి, వెట్టిచాకిరి వి ముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని, ఆమె జీవితం మహిళా లోకానికి ఆదర్శమని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు.

వంగూరు, జూలై 28: భూమి, భుక్తి, వెట్టిచాకిరి వి ముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని, ఆమె జీవితం మహిళా లోకానికి ఆదర్శమని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఆదివారం మండలంలోని పోల్కంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన చాకలి ఐ లమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల్లో చైత న్యాన్ని రగిలించి రైతు కూలీలను, రైతులను ఏకతాటిపై తెచ్చిన మహనీయురాలు ఐలమ్మ అని కొనియాడారు. గ్రామంలో ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయడం అభినం దనీయమన్నారు. ఐలమ్మ ఆశయ సాధనకోసం ప్రతీ ఒ క్కరూ కృషి చేయాలన్నారు. గ్రామంలో బీసీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి, వంగూరులో ఐలమ్మ విగ్రహం ఏ ర్పాటుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. సీఎం రేవం త్‌రెడ్డి సహకారంతో మండలా న్ని, అచ్చంపేట నియోజకవ ర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నా రు. కళాకారులు రేలారె గంగ, సందీప్ పాడిన పాటలు ప్రజ లను ఆకర్షించాయి.. కార్యక్ర మంలో మునిసిపల్ చైర్మన్ యడ్మ సత్యం, బాలాజీసింగ్, ఉప్పల వెంకటేష్, అంకు సు రేందర్, విగ్రహదాత బోగరా జు శ్రీనివాస్, ఏపీ మల్లయ్య, చిలికేశ్వరం శ్రీనువాసులు, అర్జున్‌రెడ్డి, ఐలయ్య, పీఏసీ ఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, కృష్ణయ్య, ఎముక జంగయ్య, యాదయ్య, కాశీనాథం, కృష్ణారెడ్డి, సాయిలు, లాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.