Share News

మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ

ABN , Publish Date - Sep 10 , 2024 | 11:41 PM

మొక్కవోని ధైర్యం, తెగువతో నాటి రజాకార్ల గుండెల్లో భయం పుట్టించిన చాకలి ఐల మ్మ మహిళా చైతన్యానికి ప్రతీక అని జిల్లా బీసీ సం క్షేమ అధికారి ఖాజానజీమ్‌ అలీఅప్సర్‌ అన్నారు.

మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ
కలెక్టరేట్‌లో చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న బీసీ సంక్షేమ శాఖ అధికారులు

- జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఖాజానజీమ్‌ అలీఅప్సర్‌

- జిల్లాలో ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాలు

- విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలతో ఘనంగా నివాళులు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, సెప్టెంబరు 10 : మొక్కవోని ధైర్యం, తెగువతో నాటి రజాకార్ల గుండెల్లో భయం పుట్టించిన చాకలి ఐల మ్మ మహిళా చైతన్యానికి ప్రతీక అని జిల్లా బీసీ సం క్షేమ అధికారి ఖాజానజీమ్‌ అలీఅప్సర్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 39వ వర్థంతిని నిర్వహించారు. జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఖాజా నజీమ్‌ అలీఅప్సర్‌ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి మహిళలు చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని సమాజంలో ధైర్యంగా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు శాలేశ్వర్‌, నాయ కులు మల్లేష్‌, బాలస్వామి, బంగారయ్య, కార్యాలయ సిబ్బంది సురేష్‌, శివప్రసాద్‌, లక్ష్మయ్య, దశరథ్‌ తది తరులు పాల్గొన్నారు.

సీపీఎం ఆధ్వర్యంలో : పార్టీ కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్‌.శ్రీనివాస్‌, కందికొండ గీత పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు రామయ్య, అశోక్‌, వెంకటేష్‌, నరసింహ, కురుమయ్య, మల్లికార్జున్‌, సురేష్‌ తదితరులున్నారు.

బీఎస్పీ ఆధ్వర్యంలో : పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు బస్‌స్టాప్‌ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహా నికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్‌ పూలమాల లు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో బీ ఎస్పీ జిల్లా ఇన్‌చార్జి అంతటి నాగన్న, నాయకులు మోహన్‌రెడ్డి, కళ్యాణ్‌, బాలనాగులు, నాగేష్‌, రాముడు, మొగులాల్‌, విష్ణు, రామకృష్ణ, మధు తది తరులున్నారు.

Updated Date - Sep 10 , 2024 | 11:41 PM