ఘనంగా జితమిత్ర రాయల ఆరాధనోత్సవాలు
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:21 PM
జిల్లా కేం ద్రంలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో ఆదివారం జిత మిత్ర రాయల ఆరాధనోత్స వాలు జయతీర్థల, రమేష్ రా వుల ఆధ్వర్యంలో ఘనంగా జరి గాయి.

నారాయణపేట, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేం ద్రంలోని రాఘవేంద్ర స్వామి ఆలయంలో ఆదివారం జిత మిత్ర రాయల ఆరాధనోత్స వాలు జయతీర్థల, రమేష్ రా వుల ఆధ్వర్యంలో ఘనంగా జరి గాయి. ఈ సందర్భంగా స్వామి వారికి నిర్మాల్యం, పంచామృత అభిషేకం, పుష్పాలంకరణ, మ హా నైవేద్యం, పల్లకీ సేవ, భజ న, సర్వసేవ తదితర కార్య క్రమాలు నిర్వహించారు. బెంగళూర్‌కు చెందిన విద్వాన్ భీంసేనా ఆచార్య జితమిత్ర రాయుల మ హిమలు అపారమని కొలిచిన వారికి కోరిన కోరి కలు తీరుతాయని ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. రాఘవేంద్ర స్వామి, నరసింహస్వామి మహి మలను వివరించారు. కార్యక్రమంలో అర్చకుడు నరసింహచారి, విద్వాన్‌లు హరిష్ ఆచార్య, అనిల్ దేశాయి, రాఘవేంద్ర సేవా సమితి సభ్యులు రఘుప్రేమ్ జోషి, సీతారామరావు, రాఘవేంద్ర, నరసింహ, మంజునాథ్, నారాయణరావు, శ్రీనివాస్‌రావు, భరత్ తదితరులు పాల్గొన్నారు.