Share News

రోగులకు ఇబ్బంది కల్గిస్తే చర్యలు

ABN , Publish Date - Jun 07 , 2024 | 11:23 PM

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగు లకు వైద్యులు, సిబ్బంది ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ సరిత అన్నారు.

రోగులకు ఇబ్బంది కల్గిస్తే చర్యలు
ఆసుపత్రిలో రిజిస్టర్లను పరిశీలిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

- జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత

- జిల్లా ఆసుపత్రి తనిఖీ

గద్వాల న్యూటౌన్‌, జూన్‌ 7 : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగు లకు వైద్యులు, సిబ్బంది ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ సరిత అన్నారు. జిల్లా కేంద్రంలో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా, శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. రిజిస్టర్‌ను పరిశీలించి రోగుల వివరాలను తెలుసుకున్నారు. వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. వైద్యులు అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. వారికి సకాలంలో వైద్య సేవలు అందేలా చూడా లన్నారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, కాంట్రాక్ట్‌, ఏజెన్సీల వివరాలను అందించాలని ఆదేశించారు. ఆసుపత్రికి సంబంధించి కాంట్రాక్టర్‌ నేరుగా తమను సంప్రదించాలని, కింది స్థాయి సిబ్బంది కాదని అన్నారు. మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ మాట్లాడుతూ ఆసుపత్రిలో జరిగే విషయాలను గతంలో అధికారులు తమ దృష్టికి తెచ్చేవారన్నారు. కానీ ఇప్పు డు సమాచారం ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఆసుపత్రికి తాను చైర్మన్‌ అన్న సంగతిని గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మంచిదన్నారు. కొందరు రూల్స్‌ మాట్లాడుతున్నారని, అవి మాకు కూడా తెలు సన్నారు. వారి వెంట కాంగ్రెస్‌ నాయకులు గంజిపేట శంకర్‌, మధుసూదన్‌బాబు, డీటీడీసీ నర్సింహులు, నాగేందర్‌యాదవ్‌, కోటేష్‌, జమ్మిచేడు ఆనంద్‌, సురేష్‌ ఉన్నారు.

Updated Date - Jun 07 , 2024 | 11:23 PM