Share News

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి

ABN , Publish Date - Jan 12 , 2024 | 10:49 PM

రాబోయే వేసవిలో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మునిసిపాలి టీల్లో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టా లని నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ మి షన్‌భగీరథ అధికారులను ఆదేశించారు.

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

- కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : రాబోయే వేసవిలో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మునిసిపాలి టీల్లో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టా లని నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ మి షన్‌భగీరథ అధికారులను ఆదేశించారు. తాగునీటి వేస వి ప్రణాళికపై శుక్రవారం నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌ వీడి యో కాన్ఫరెన్స్‌ మీటింగ్‌ హాల్‌లో ఆర్‌డబ్ల్యూఎస్‌, మిషన్‌ భగీరథ, విద్యుత్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాలుగు మునిసిపాలిటీల్లో 86వార్డులు, 20మండలాల్లోని 726 గ్రామాల్లో నీటి వనరులను ఒక్కో ఏఈవో కలెక్టర్‌ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఏ గ్రామంలో ఏ స మస్యతో తాగునీరు సరఫరా కావడం లేదు అందుకు కా వాల్సిన మరమ్మతుల నిధుల అంచనాను సైతం సమా వేశంలో కలెక్టర్‌ నిర్ధారించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడై నా గ్రామాల్లో మరమ్మతులకు అవసరమైన పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పైపులను ఇతర చిన్న చిన్న మరమ్మతులకు కావాల్సిన రూ.కోటి 50లక్షల నిధులను మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎక్కడై నా గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలు ఉంటే వెంటనే ఏర్పాటు చేయాలని విద్యుత్‌ శాఖ ఎస్సీ లీలావతిని కలెక్టర్‌ ఆదేశించా రు. గ్రామాల్లో పని చేసే లైన్‌మెన్లు నీటి వృథా కాకుండా పకడ్బందీ చర్యలు చేప ట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజుకు గ్రామస్థాయిలో 100లీటర్లు, పట్టణ స్థాయిలో 135లీటర్ల చొప్పున తాగునీటిని అందించాలని, ఒక నెలకు 0.7టీఎంసీ నీరు జిల్లాలో తాగునీటి అవసరాలకు తప్పనిసరిగా వినియోగించాలని కలెక్టర్‌ సూచించారు. రానున్న ఏడు మాసాల పాటు తాగునీటి అవసరాలకు కావాల్సిన ఐదు టీఎంసీలన్నింటినీ శ్రీశైలం రిజర్వాయర్లు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్లు 827.9లెవల్‌ల్లో 47.44టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయని అందులో 31టీఎంసీల వరకు డెడ్‌ స్టోరేజీగా పరిగణించబడుతుందని అందుకనుగుణంగానే రాను న్న వేసవి తాగునీటి అవసరాలకనుగుణంగా రి జర్వాయర్లు నీటి లభ్యత ఉండేలా పర్యవేక్షించాలని కలె క్టర్‌ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ లోకల్‌బాడీ కుమార్‌దీపక్‌, మహబూబ్‌నగర్‌ సర్కిల్‌ మిషన్‌భగీరథ సూపరింటెం డెంట్‌ ఇంజనీర్‌ కే వెంకటరమణ, జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ, ఎలక్ట్రిసిటీ ఎస్సీ లీలావతి, మిషన్‌భగీరథ ఈఈలు శ్రీధర్‌రావు, సుధాకర్‌సింగ్‌, మిషన్‌భగీరథ డీఈలు హేమలత, మల్లేశ్వర్‌రావు, సురేష్‌, సుదర్శన్‌, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 10:49 PM