Share News

ఎన్నికల నిబంధనలకనుగుణంగా వ్యవహరించాలి

ABN , Publish Date - May 03 , 2024 | 10:47 PM

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకనుగుణంగా వ్యవ హరించాలని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ పి.ఉదయ్‌కు మార్‌ అన్నారు.

 ఎన్నికల నిబంధనలకనుగుణంగా వ్యవహరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

- కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌, మే 3 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకనుగుణంగా వ్యవ హరించాలని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ పి.ఉదయ్‌కు మార్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమా వేశ మందిరంలో పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఏజెంట్లతో, పోస్టల్‌ బ్యాలెట్‌, హోమ్‌ ఓటింగ్‌, అత్యవసర సేవల సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం, ఎన్నికల ప్రవర్తన నియమావళి, నిబంధనలు, సీ విజల్‌ యాప్‌, సువిధ యాప్‌ గురించి వివరంగా కలెక్టర్‌ తెలి పారు. పార్లమెంట్‌ నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల నిబంధనలకనుగుణంగా వ్యవహరిం చాలని, ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల సం ఘం ఆదేశాలకనుగుణంగా పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఈ నెల 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు హోం ఓటింగ్‌ నిర్వహించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశా మని తెలిపారు. దీనిలో భాగంగా నాగర్‌కర్నూల్‌ పార్ల మెంటరీ నియోజకవర్గం పరిధిలో హోం ఓటింగ్‌ ఓటర్లు మొత్తం 546మంది ఉన్నారు.. వీరిలో సీనియర్‌ సిటిజన్స్‌ 228 మంది, దివ్యాంగులు 259 ఓట ర్లు, అత్యవసర సేవలకు సం బంధించిన ఓటర్లు 59మంది ఉ న్నారు... హోం ఓటింగ్‌ ప్రక్రి యను చేపట్టడానికి 33రూట్లను చేసినట్లు 22బృందాల హోం ఓ టింగ్‌ ప్రక్రియలో పాల్గొంటున్న ట్లు తెలిపారు. పార్లమెంట్‌ సా ధారణ ఎన్నికలు 2024 నియ మావళి ప్రకారం రాజీకయ పా ర్టీలు, సభలు అనుమతులకు ఇతర కార్యకలాపాల కో సం వచ్చే దరఖాస్తులను ఎన్నికల నియమాలకు లోబడి అనుమతులు మంజూరు చేస్తుందని తెలిపారు. సువిధ యాప్‌ ద్వారా ఎన్నికల ప్రచార సభలకు, సమావేశాలకు లాగిన్‌ అయితే నిబంధనలకు లోబడి వెంటనే అనుమ తులు మంజూరు వస్తుందని తెలిపారు. సువిధ యాప్‌ ద్వారా వస్తున్న దరఖాస్తులను ఎప్పటిప్పుడు పరిశీలిస్తూ నిబంధనలకు లోబడి ఉన్న వాటికి నిర్ణీత గదువులోపు అనుమతులు జారీ చేసేలా చొరవ చూపనున్నట్లు పే ర్కొన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేలా డబ్బు, మద్యం పంపిణీపై ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, ఎస్‌ఎస్‌టీ తనిఖీలు పక డ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతీ ఒక్క లా వాదేవీలపై తప్పనిసరిగా రిజిస్టర్‌లో నమోదు చేయాల న్నారు. సువిధ పోర్టల్‌లో నమోదుపై రాజకీయ పార్టీల వారికి అవగాహన కల్పించామని ఎంసీసీ నియమ ని బంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని వివరించా రు. అకౌంటింగ్‌ టీం సభ్యులు వివరాలను షాడో అబ్జర్వే షన్‌ రిజిస్టర్లలో నమోదు చేయాలని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - May 03 , 2024 | 10:47 PM