Share News

కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ

ABN , Publish Date - Jan 03 , 2024 | 11:08 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ జిల్లా వ్యాప్తంగా సజావుగా కొనసాగు తున్నది.

కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ
మానవపాడులో మహిళ నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్న అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు

- జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం

- పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు

ధరూరు/ కేటీదొడ్డి/ గట్టు, జనవరి 3 : కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ జిల్లా వ్యాప్తంగా సజావుగా కొనసాగు తున్నది. ధరూరు మండల పరిధిలోని గార్లపాడు రైతు వేదిక ఆవరణలో, కేటీదొడ్డి మండల పరిధిలోని పాగుంట, చింతలకుంట, గట్టు మండల పరిధిలోని మాచర్ల గ్రామాల్లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత పాల్గొని, ప్రజల నుంచి దరఖా స్తులను స్వీకరించారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

మానవపాడు : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని, దరఖాస్తుదారులను ఇబ్బంది పెట్టొద్దని అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మండలంలోని మానవపాడు, చెన్నిపాడు గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిం చారు. మానవపాడులో 1,338, చెన్నిపాడులో 254 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో మండల ప్రత్యేక ఆఫీసర్‌ నాగ్రేందం, ఎంపీడీవో రమణరావు, ఏవో సుబ్బారెడ్డి, సర్పంచు హైమావతి దామోదర్‌ రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు మహేశ్వరి మద్దిలేటి, నాయకులు వెంకట్రాముడు, మురళిరెడ్డి, హరినాథ్‌ రెడ్డి, శేఖర్‌రెడ్డి, నేతాజీ, రవి, గోపాల్‌ పాల్గొన్నారు.

వడ్డేపల్లి : వడ్డేపల్లి మండల పరిధిలోని కొంకల, కోయిలదిన్నె, రామాపురం గ్రామాల్లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో ఉప ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ముషాయిదా బేగం, ఎంపీడీవో రవీంద్ర, తహసీల్దార్‌ జ్యోతి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచు పుల్లారెడ్డి, ఎంపీవో తిరుపతన్న, పంచా యతీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి, ఏపీవో విజయ లలిత ఉన్నారు.

- వడ్డేపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు టి.హనుమంతు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారం భించారు. మునిసిపాలిటీ పరిధిలోని ఎనిమిది, 10వ వార్డుల్లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్‌ నాయకులు వడ్డేపల్లి దేవేంద్ర, జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగశిరోమణి, రాంప్రసాద్‌, పార్టీ మండల అధ్యక్షురాలు జయశ్రీ, నాయకులు టి.వెంకటేష్‌, భీమ్‌రెడ్డి, వడ్డేపల్లి జగన్‌, ప్రేమ్‌కుమార్‌, నవాజ్‌ రాజశేఖర్‌, శ్రీను, పరశు రాముడు, కార్యకర్తలు ఉన్నారు.

ఇటిక్యాల : మండలంలోని ఉదండాపురం, పెద్దదిన్నె గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారి, ఆర్డీఎస్‌ ఈఈ విజయ్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. ఉదండాపురంలో 583, పెద్దదిన్నెలో 623 దరఖాస్తులు వచ్చి నట్లు తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఎంపీవో భాస్కర్‌యాదవ్‌ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు అయ్యమ్మదానం, గోవర్దన్‌రెడ్డి, రెవెన్యూ అదికారులు అజిత్‌కుమార్‌, భీంసేనరావు పాల్గొన్నారు.

అలంపూర్‌ చౌరస్తా/ ఉండవల్లి : మండల పరిధిలోని కలుగొట్ల, శేరుపల్లి గ్రామాల్లో బుధవారం ప్రజాపాలన ధరఖాస్తులను స్వీకరించారు. కలుగొట్ల లో 512, శేరుపల్లిలో 240 మొత్తం 752 ధరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలపారు. కార్యక్రమంలో సీఈవో కాంతమ్మ, ఎంపీడీవో ఆంజనేయరెడ్డి, పంచా యతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

రాజోలి : రాజోలి మండలంలోని పెద్ద తాండ్రపాడు, మాన్‌దొడ్డి గ్రామాల్లో ఎంపీడీవో గోవింద్‌రావు ఆధ్వర్యంలో బుధవారం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద తాండ్రపాడు లో 1,053, మాన్‌దొడ్డిలో 1,143 ధరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో గోవింద్‌ రావు తెలిపారు.

అయిజ : అయిజ పట్టణంలోని దుర్గానగర్‌ కాలనీలో నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమా న్ని అదనపు కలెక్టర్‌ చీర్ల శ్రీనివాస్‌ పరిశీలించారు. అందరికీ రశీదులు ఇవ్వాలని సూచించారు.

Updated Date - Jan 03 , 2024 | 11:08 PM