సైబర్ మోసానికి గురైన మహిళ
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:32 PM
సైబర్ నేరగాళ్ల ముసుగులో మ హిళ పడి రూ. 2.22 లక్షలు మోసానికి గురైన ట్లు ఎస్‌ఐ గోవర్ధన్ శుక్రవారం తెలిపారు.

నాగర్‌కర్నూల్‌క్రైం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్ల ముసుగులో మ హిళ పడి రూ. 2.22 లక్షలు మోసానికి గురైన ట్లు ఎస్‌ఐ గోవర్ధన్ శుక్రవారం తెలిపారు. వివరా ల ప్రకారం... నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాంనగ ర్ కాలనీకి చెందిన నజీమా బేగం తన ఫంక్షన్లో ఇస్టాగ్రామ్ చూసుకుంటుండగా అజ్మీర్ దర్గాకు సంబంధించిన అంశాలు రావడంతో క్షు ణ్ణంగా పరిశీలించింది. అందులో అనారోగ్యానికి గురైతే నయం చేస్తామని పోస్టింగ్ రావడంతో ఆమె మెసేజ్‌ను క్లిక్ చేసి వారితో మాటాడింది. వారి మాటలు నమ్మి తన అనారోగ్యానికి గురైన కూ తురు నయం అవుతుందని మొదటగా రూ.5 వేలు వారికి పంపింది. ఇప్పటి వరకు రూ.2.22 లక్షలు వారి ఖాతాలోకి వేయించుకు న్నారు. మళ్లీ 3లక్షలు కావాలని అడగడంతో అ నుమానంతో నజిమాబేగం శుక్రవారం ఫిర్యాదు చేయడంతో కేసు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.