Share News

ఆత్మీయ అనుచరుడికి కన్నీటి నివాళి

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:02 PM

తన ఆత్మీయ అనుచరుడు నారాయణపేట జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గి మునిసిపల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ గోవర్ధన్‌రెడ్డి మృతికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శుక్రవారం ఘనంగా నివాళి అర్పించారు.

ఆత్మీయ అనుచరుడికి కన్నీటి నివాళి
గోవర్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

కోస్గి మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గోవర్ధన్‌రెడ్డి కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి ఓదార్పు

కోస్గి, జూలై 5 : తన ఆత్మీయ అనుచరుడు నారాయణపేట జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గి మునిసిపల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ గోవర్ధన్‌రెడ్డి మృతికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి శుక్రవారం ఘనంగా నివాళి అర్పించారు. కోస్గి మునిసిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లిలో గల గోవర ్ధన్‌రెడ్డి నివాసానికి రాగానే మృతుడి తల్లి యాదమ్మ ముఖ్యమంత్రి కాళ్లపై పడి బోరున విలపించింది. ముఖ్యమంత్రి ఆమెను దగ్గరకు తీసుకొని నేనున్నానంటూ ధైర్యం చెప్పారు. అనంతరం గోవర్ధన్‌రెడ్డి పార్థివదేహం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించి కన్నీరు పెట్టుకున్నారు. నమ్ముకున్న కార్యకర్త మృతి ఆయనను ఒక్కసారి కుదిపేసింది. అనంతరం గోవర్ధన్‌రెడ్డి భార్య సావిత్రమ్మ, కుమారుడు శంకర్‌రెడ్డి, కుమార్తె శషాంతికను ఓదార్చారు. తాను అండగా ఉంటానని అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి వెంట ఆయన సోదరుడు, కొడంగల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, తాండూర్‌ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 11:02 PM