Share News

పట్టుతప్పుతున్న పాలన

ABN , Publish Date - Feb 17 , 2024 | 11:57 PM

వనపర్తి జిల్లాలో ఉన్న ఐదు మునిసిపాలిటీల్లో వనపర్తి మేజర్‌ మునిసిపాలిటీ. ఆ మునిసిపాలిటీలో పాలన పట్టుతప్పుతోందని పలువురు కౌన్సిలర్లు విమర్శి స్తున్నారు.

పట్టుతప్పుతున్న పాలన
వనపర్తి పట్టణం

- వనపర్తి మునిసిపాలిటీలో ఎవరికి వారే యమునా తీరే

- కమిషనర్‌ లేడు.. ఏఈ రాలేడు.. డీఈ ఉన్నా లేనట్లే

- పదవులు కాపాడుకోవడంలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లు

- గాలికి వదిలిన పన్నుల వసూలు

- జనవరి నాటికి వసూలైంది 30.02 శాతం మాత్రమే

- మరో రెండు నెలల్లో ముగియనున్న ఆర్థిక సంవత్సరం

వనపర్తి టౌన్‌, ఫిబ్రవరి 17: వనపర్తి జిల్లాలో ఉన్న ఐదు మునిసిపాలిటీల్లో వనపర్తి మేజర్‌ మునిసిపాలిటీ. ఆ మునిసిపాలిటీలో పాలన పట్టుతప్పుతోందని పలువురు కౌన్సిలర్లు విమర్శి స్తున్నారు. మునిసిపల్‌ కమిషనర్‌గా ఉన్న విక్ర మసింహారెడ్డి ఇటీవలే బదిలీపై వెళ్లిపోయారు. ఆయన స్థానంలో మరో అధికారి ఇంతవరకు రాలేదు. వనపర్తి మునిసిపల్‌ కమిషనర్‌గా రావాలంటేనే కొందరు జంకుతున్నారని, దాదాపు ఐదుగురి పేర్ల తరువాత చివరికి మిర్యాలగూడ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న పూర్ణ చందర్‌ను నియమిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వు లు జారీ చేశారు. అయినప్పటికీ కొత్త కమిషనర్‌ శనివా రం వరకు విధుల్లో చేరలేదు. నెలరోజులుగా మునిసిపల్‌ ఏఈ తన వ్యక్తిగత కారణాలతో విధులకు రావడం లేదు. డీఈ ఉన్నా లేనట్లే.. ఆయన ప్రతీ రోజు హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో విధులకు సమయం కేటా యించలేకపోతున్నారు. రెవెన్యూ అధికారి ఐదు రోజులుగా దైవదర్శనాల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఆర్థిక సంవత్సరం ముగిం పు దగ్గర పడుతున్న తరుణంలో మునిసిపాలిటీకి రావాల్సిన ఆదాయం రాబట్టాల్సిన అధి కారి తనకేమి పట్టనట్లు తీర్థయాత్రలో ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమనే ఆరోపణలున్నాయి.

నిన్నటి వరకు పంచాయితే..

అధికారుల తీరు ఇలా ఉంటే పాలకవర్గ సభ్యుల తీరు మరోలా ఉంది. మునిసిపాలిటీలో ఉన్న 33 మంది కౌన్సిలర్లలో 23 మంది బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందినవారే ఉన్నారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను తొలగించేందుకు అవిశ్వాసం పెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లు పరిపాలన వ్యవస్థను గాలికొదిలేసి తమ పదవులు కాపాడుకునే పనిలో నిమగ్న మయ్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సం బంధించి ఆస్తి పన్ను రూపంలో వనపర్తి మునిసిపాలిటీకి రూ.8.57 కోట్లు రావాల్సి ఉంది. కానీ ఈ ఏడాది జనవరి 31 నాటికి దాదాపు రూ. 2.57 కోట్లు మాత్రమే వసూలు చేశారు. అంతే కాకుండా మునిసిపాలిటీ ఆధ్వర్యంలో నిర్మించిన షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, వీధి వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన డబ్బాల రూపంలో రూ.76 లక్షలు వసూలు కావాలి, కానీ జనవరి 31 నాటికి అవికూడా కేవలం రూ.16.86 లక్షలు మాత్రమే వసూలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయం రాబట్టడంలో కేవలం 30.02 శాతానికి మాత్రమే చేరుకున్నారు. వీటితో పాటు ట్రేడ్‌ లైసెన్స్‌ బిల్లులు, నల్లా బిల్లులు ఇలా అనేక ఆదాయ వనరులను సరైన రీతిలో వసూలు చేయించడంలో నాయకులు, అధికారులు విఫవలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి..

Updated Date - Feb 17 , 2024 | 11:57 PM