Share News

దేశానికే మార్గదర్శి

ABN , Publish Date - Apr 14 , 2024 | 11:38 PM

భారత దేశానికే దిక్సూచి, మార్గదర్శిగా డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ నిలిచారని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పే ర్కొన్నారు.

దేశానికే మార్గదర్శి
కొల్లాపూర్‌లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో మంత్రి జూపల్లి కృష్ణారెడ్డి

కొల్లాపూర్‌, ఏప్రిల్‌ 14 : భారత దేశానికే దిక్సూచి, మార్గదర్శిగా డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ నిలిచారని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పే ర్కొన్నారు. భారత రా జ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్‌ జయంతి వేడుకలను కొల్లాపూర్‌ పట్టణంలో అంబేడ్కర్‌ యు వజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించా రు. అంబేడ్కర్‌ యువజన సంఘం అధ్యక్షుడు జగదీష్‌, దళిత బహుజన ఉపాధ్యాయ సంఘాల నాయకుడు చెన్నయ్య, తెలంగాణ మాలల చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మద్దెల రాం దాస్‌ల అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారా వు అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివా ళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం విరాజిల్లడానికి అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగమే ప్రధాన కారణమని అన్నారు. మానవ హక్కులను రాజ్యాంగంలో పొందుపర్చి అందరికీ స్వేచ్చా సమానత్వాన్ని కల్పించిన భారత రాజ్యాం గం ద్వారా దేశప్రజలు స్వేచ్చా వాయువులు పీల్చు కుంటున్నారని తెలిపారు. అనంతరం దళిత సం ఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ జయంతి సందర్భం గా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మం త్రి జూపల్లి పేర్కొన్నారు. అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు అంబేడ్కర్‌ విగ్రహా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా అంబేడ్కర్‌ చేసిన సేవలను ఆయన కొని యాడారు. అంతకు ముందు అంబేడ్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో యువకులు మో టారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ జ యంతి సందర్భంగా మునిసిపల్‌ కౌన్సిలర్లు, దళిత యువజన, దళిత బహుజన ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, కార్మికులు, బహుజనవా దులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

Updated Date - Apr 14 , 2024 | 11:39 PM