కోస్గి బల్దియాకు నిధుల వరద
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:02 PM
కోస్గి బల్దియాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నిధుల వరద మొదలైంది.

- ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు
- ప్రస్తుతం రూ.48 కోట్లు విడుదల
- త్వరలో వార్డుల వారీగా పనులు ప్రారంభం
కోస్గి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): కోస్గి బల్దియాకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నిధుల వరద మొదలైంది. బల్దియాలోని 16 వార్డుల అభివృద్ధికి మొదట రూ.48 కోట్లు మంజూరు చేశారు. ప్రతీ వార్డులో డ్రైనేజీల నిర్మాణం, సీసీ రోడ్లు, వీధి దీపాలు, పార్కుల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొదటగా ప్రతీ వార్డులో అత్యవసర మున్న పనులకు ఎస్టిమేట్ వేసి టెండర్ ప్రక్రియ చేస్తున్నారు. ఇందులో భాగంగానే శివాజీ కూడలి నుంచి ఇంజనీరింగ్ కళాశాల వరకు రోడ్డు వెంట సెంట్రల్ లైటింగ్, అదేవిధంగా శివాజీ కూడలి నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు లైటింగ్ ఏర్పాటు, పార్కుల పనులకు శ్రీకారం చుట్టారు. కాగా పట్టణంలోని 16 వార్డుల్లో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండటంతో వార్డుల వారీగా అధికారులు డ్రైనేజీ, సీసీ రోడ్లకు ప్రతిపాదనలు సి ద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ శాశ్వత భవనాలతో పాటు ప్రత్యేకం గా కొడంగల్ నియోజకవర్గానికి మరో రూ.60 కోట్లు మంజూరయ్యాయి. దీంతో ప్రతీ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చెందనుంది. నిధులతో అదనపు తరగతి గదులు, ప్రహరీ నిర్మాణాలు కూడా చేపట్టను న్నారు. ప్రస్తుతం కొడంగల్‌కు నిధుల వరద మొదలైంది.