Share News

చేతులకు సంకెళ్లతో ‘సమగ్ర’ నిరసన

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:37 PM

ఉద్యోగ భద్రత, సమస్యల పరిష్కారం కోరుతూ గడచిన 19రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగి స్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు 20వ రోజు ఆది వారం వినూత్న రీతిలో నిరసన కొనసాగించారు.

చేతులకు సంకెళ్లతో ‘సమగ్ర’ నిరసన

గద్వాల టౌన్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ భద్రత, సమస్యల పరిష్కారం కోరుతూ గడచిన 19రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగి స్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు 20వ రోజు ఆది వారం వినూత్న రీతిలో నిరసన కొనసాగించారు. శిబిరంలో పాల్గొన్న నిరసనకారులు చేతులకు సంకెళ్లు వేసుకుని, తలపై ప్రత్యేక టోపీలు ధ రించి సంకెళ్లు తెపండి.. రెగ్యులర్‌ చేయండి.. అనే నినాదంతో శిబిరంలో కొద్దిసేను నినాదాల హోరు వినిపించారు. దీక్షా శిబిరం వద్దకు వచ్చిన ఎస్టీ యూటీఎస్‌, టీపీయూఎస్‌, టీఎస్‌జీహెచ్‌ఎంఏ, డీటీఎఫ్‌, పీఆర్‌టీయూటీఎస్‌ తదితర ఉపాధ్యా య సంఘాలకు చెందిన నాయకులు ఎండీ యూనిస్‌పాషా, లక్ష్మణ్‌, మనోహర్‌ రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, ప్రతాప్‌ రెడ్డి, అశోక్‌కుమార్‌, దేవేందర్‌ రెడ్డి, బలరాం, ఆర్‌.మోహన్‌తో పాటు ప్రజాసంఘాల కు చెందిన నాయకులు ఎండీ సుభాన్‌, ఏపీ రాష్ట్ర సమగ్రశిక్ష జేఏసీ నాయకులు మహ్మద్‌ రఫీ, జగదీష్‌, మధుమోహన్‌, సాయిబేష్‌, రంగ న్నగౌడ్‌ వనపర్తికి చెందిన ప్రజాగాయకులు రా జారాం, డప్పు నాగరాజు, ప్రకాష్‌, బడేసాబ్‌లు ఉద్యోగుల సమ్మెకు మద్దతునిస్తున్నట్లు తెలిపా రు. సమ్మెలో గద్వాల అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూ ల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ శేషన్న, కేజీబీవీల స్పెషల్‌ ఆఫీసర్లు శ్రీదేవి, పద్మావతి, గోమతి, చెన్నబస మ్మ, విజయలక్ష్మి, పద్మ, చంద్రకళ, పరిమళ, కృ ష్ణవేణి, అనురాధ, ఆసియాబేగం, సీఆర్‌టీలు, టీ జీసీఆర్‌టీలు, నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌, జేఏసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హుసేనప్ప, గోపాల్‌, మహిళా అధ్యక్షురాలు ప్రణీత, వివిధ విభాగాల అధ్యక్షులు రామాంజనేయులు, శ్రీధర్‌, అల్తాఫ్‌, ఎంఏ సమి, మురళి, రాజేందర్‌ ఉన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 11:37 PM