డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:22 PM
పట్టణంలోని మౌలాలిగుట్ట వద్దనున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కాలనీని సోమవారం కలెక్టర్ విజయేందిర బోయి పరిశీలించారు.

మహబూబ్‌నగర్, జూన్ 17 : పట్టణంలోని మౌలాలిగుట్ట వద్దనున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కాలనీని సోమవారం కలెక్టర్ విజయేందిర బోయి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలను ఆమె పరిశీలించి వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ జీప్లస్2 పద్ధతిలో 28 బ్లాక్‌లలో 672 ఇళ్లను గృహ నిర్మాణశాఖ ఇంజనీరింగ్ విభాగం ద్వారా చేపట్టింది. ఫ్లోర్‌కు ఎనిమిది ఇళ్ల చొప్పున ఒక బ్లాక్‌లో 24 గృహాలు నిర్మించారు. మొదటి దశలో 588, రెండో దశలో 84 ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందని హౌసింగ్ ఈఈ వైద్యం భాస్కర్ కలెక్టర్‌కు వివరించారు. 672 గృహాల్లో ఇప్పటివరకు 588 గృహాలు లబ్ధిదారులకు కేటాయింపులు చేశారని, వాటిని హ్యాండోవర్ చేయాల్సి ఉందని తెలిపారు. మౌలిక వసతుల కల్పన కోసం రూ.7.85 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిం చామని ఆయన పేర్కొన్నారు. ఇందులో విద్యుత్ సరఫరాకు పోల్స్. విద్యుత్ లైన్‌లు, ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటుకు రూ.69.30 లక్షలు, తాగునీటి సరఫరాకు రూ.4.86 కోట్లు, రూ.1.76 కోట్లు డ్రైనేజీ నిర్మాణాలు, రూ.53.69 లక్షలతో అంతర్గత రహదారుల నిర్మాణం కోసం ప్రతి పాదనలు పంపామని ఈఈ కలెక్టర్‌కు వివరించారు.