ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలకాలి
ABN , Publish Date - Jul 15 , 2024 | 11:11 PM
చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించి, వారి ఉజ్వత భవిష్యత్తుకు నాంది పలకాలని సీడీపీవో హేమలత అన్నారు.
- అంగన్‌వాడీ బడిబాటలో సీడీపీవో హేమలత
గద్వాల న్యూటౌన్, జూలై 15 : చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించి, వారి ఉజ్వత భవిష్యత్తుకు నాంది పలకాలని సీడీపీవో హేమలత అన్నారు. డీడబ్ల్యూవో సుధారాణి ఆదేశం మేరకు సోమవారం నుంచి ఈనెల 20 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిం చనున్నారు. అందులో భాగంగా సోమవారం అన్ని అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ‘మన ఊరు - మన అంగన్‌వాడీ’ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మూడు, నాలుగు, ఐదు, ఆరు కేంద్రాలకు సంబంధించి టీచర్లు, ఆయాలు, బాలికలు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, చిన్నారులు, తల్లిదండ్రులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రా ల్లో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు, పౌష్టికాహారాన్ని అందిస్తారని తెలిపారు.
చిన్నారులకు ప్రీస్కూల్ ద్వారా విద్యాబోధన
మల్దకల్ : అంగన్‌వాడీ చిన్నారులకు ప్రీస్కూల్ ద్వారా విద్యాబోధన చేసేందుకు ప్రభుత్వం కొత్త ప్రణాళికను రూపొందించిందని సీడీపీవో కమలాదేవి అన్నారు. ‘అమ్మ మాట - అంగన్‌వాడీ బాట’ కార్యక్రమంలో భాగంగా సోమవారం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు, పిల్లలను కేంద్రాల్లో చేర్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. చర్లగార్లపాడులో సూపర్‌వైజర్ నాగరాణి ఆధ్వ ర్యంలో అమ్మబాట - అంగన్‌వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీవో ప్రవీణ్, ఏపీఎం నరహరి, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
చిన్నారులను అంగన్‌వాడీలకు పంపించాలి
మానవపాడు : చిన్నారులను తప్పనిసరిగా అంగన్ వాడీ కేంద్రాలకు పంపించాలని సీడీపీవో సుజాత తల్లిదం డ్రులకు సూచించారు. మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం నిర్వహించిన ‘అమ్మ మాట - అంగన్ వాడీ బాట’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారంతో చిన్నారులు ఆరోగ్యంగా ఎదుగుతారని, అక్షరాలు నేర్చుకుంటారని అన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు సుమిత్ర, చెన్నమ్మ, విమల, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.