Share News

క్రెడిట్‌ కార్డు పేరుతో రూ.99 వేలు టోకరా

ABN , Publish Date - May 17 , 2024 | 10:52 PM

మీరు క్రెడిట్‌ కార్డుకు అర్హులయ్యారని, మీరు ఒప్పుకుంటే కార్డు మంజూరు అవుతుందని చెప్పడంతో సరే అన్న పాపానికి రూ. 99,277 పోగొట్టుకున్న సంఘటన గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకొంది. ఇందుకు సంబంధించి బాధితుడు నరేష్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

క్రెడిట్‌ కార్డు పేరుతో రూ.99 వేలు టోకరా

జోగుళాంబ గద్వాల జిల్లాలో ఘటన

గద్వాల క్రైం, మే 17: మీరు క్రెడిట్‌ కార్డుకు అర్హులయ్యారని, మీరు ఒప్పుకుంటే కార్డు మంజూరు అవుతుందని చెప్పడంతో సరే అన్న పాపానికి రూ. 99,277 పోగొట్టుకున్న సంఘటన గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకొంది. ఇందుకు సంబంధించి బాధితుడు నరేష్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గద్వాల పట్టణంలోని సుంకులమ్మమెట్టుకు చెందిన నరేష్‌ పాల వ్యాపారం చేస్తుంటాడు. గత నెల నాల్గో తేదీన హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నామని ఓ వ్యక్తి నరేష్‌కు ఫోన్‌ చేశాడు. మీరు క్రెడిట్‌ కార్డుకు అర్హులయ్యారని చెప్పడంతో కార్డు మంజూరు చేసేందుకు నరేష్‌ అంగీకరించాడు. మళ్లీ ఏప్రిల్‌ తొమ్మిదిన ఫోన్‌ చేసి కార్డు వచ్చింది కదా మీ కార్డు నెంబర్‌ చెప్పండని అడిగారు. కార్డు నెంబర్‌ చెప్పాక, ఓటీపీ అడిగారు. దాంతో ఓటీపీ కూడా చెప్పాడు. గురువారం(మే 16)న హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ అఽధికారులు ఫోన్‌ చేసి, మీ క్రెడిడ్‌ కార్డు నుంచి రూ.99,277 వాడుకున్నారని అది చెల్లించాలని కోరారు. దాంతో కంగారు పడిన నరేశ్‌ తాను ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయలేదని శుక్రవారం బ్యాంక్‌ అఽధికారులను ఆశ్రయించారు. మీరు డబ్బులు ఖర్చు చేసినట్లు ఉందని, తప్పక చెల్లించాలని బ్యాంకు సిబ్బంది చెప్పారు. దాంతో నరేష్‌ క్రెడిట్‌ కార్డు ఎక్కడ వాడినట్టు వివరాలు తెలు పాలని బ్యాంక్‌ సిబ్బందిని కోరగా కనిపించడం లేదని, కానీ ఖర్చు చేసినట్లు మాత్రం ఉందని చెప్పారు. దాంతో ఆన్‌లైన్‌లో తన డబ్బులను ఎవరో దొంగలించారని భావించి, సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు చేశానని తెలిపాడు.

Updated Date - May 17 , 2024 | 10:52 PM