కొల్లాపూర్ పట్టణ అభివృద్ధికి రూ.8 కోట్లు
ABN , Publish Date - Dec 14 , 2024 | 11:44 PM
కొల్లాపూర్ మునిసిపాలిటీని రాష్ట్రం లోనే ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
- రాష్ట్రంలోనే ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దుతా
- రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : కొల్లాపూర్ మునిసిపాలిటీని రాష్ట్రం లోనే ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కొల్లాపూర్ పట్టణంలో రూ.8 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాటా ్లడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన తరు ణంలోని కొల్లాపూర్ మునిసిపాలిటీకి ఎప్పుడు లేని విధంగా రూ.8 కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. ఈ నిధుల ద్వారా కొల్లాపూర్ మునిసిపల్ ప్రజలకు కావా ల్సిన వసతులు సమకూరు తాయన్నారు. పనులను వేగవంతంగా నాణ్యతగా చేయాలని అధికారులను, మునిసిపల్ పాలక మండలిని ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి జూపల్లికి ఆ వార్డు ప్రజలు, కౌన్సిలర్లు సన్మానిం చారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య, వైస్ చైర్మన్ మహ మూదా బేగం, మునిసిపల్ కమిషనర్ శ్రీనివాసన్, కౌన్సిలర్లు, సింగిల్ విండో డైరెక్టర్, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.