బడ్జెట్‌లో 20 శాతం నిధులు కేటాయించాలి
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:15 PM
సమాజ పురోగతిలో కీలక భూమిక పోషించే విద్యారంగానికి బడ్జెట్‌లో కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని తెలంగాణ విద్యా పరి రక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు.

- విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ
గద్వాల టౌన్, జూలై 28 : సమాజ పురోగతిలో కీలక భూమిక పోషించే విద్యారంగానికి బడ్జెట్‌లో కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని తెలంగాణ విద్యా పరి రక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఒక ప్రైవేటు పంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్‌లో విద్యారంగానికి కేటా యింపులు ఎనిమిది శాతం కూడా దాటక పోవడం నిరాశ కలిగించిందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా కన్పించలేదని అసంతృష్తి వ్యక్తం చేశారు. విద్యారంగానికి బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటా యిస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు, అధికారంలోకి రాగానే ఆ హామీని గాలికి వదిలేశారని ఆరోపించారు. తమిళ నాడు రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు 13.4 శాతం, కర్ణాటకలో 12.9, కేరళలో 14.8, ఆంధ్రప్రదేశ్‌లో 12.7, మహారాష్ట్రలో 16.3, బిహార్‌లో 18.4, మధ్యప్రదేశ్‌లో 16.1, ఢిల్లీలో 23.5 శాతం నిధులు కేటాయించిన విషయాన్ని రాష్ట్ర పాలకులు గుర్తుంచు కోవాలన్నారు. కొఠారీ కమిషన్ విద్యకు 30 శాతం కేటా యించాలని సూచించినట్లు గుర్తు చేశారు. సమా వేశంలో కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఎన్ కిష్టప్ప, సీఎల్‌సీ జిల్లా అధ్యక్షుడు ఎండీ సుభాన్, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఉదయ్‌కిరణ్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.