Share News

నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:18 PM

బాధితుడి వద్ద ఉన్న బంగారం, నగదును కుటుంబ సభ్యు లకు అందజేసిన 108 సిబ్బంది నిజాయితీని డాక్టర్లు, పోలీసులు, ప్రజలు అభినందిం చారు.

నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది
బాధితుడి కుటుంబ సభ్యుడికి నగదు, బంగారు అందజేస్తున్న 108 సిబ్బంది

బిజినేపల్లి, జూన్‌ 10 : బాధితుడి వద్ద ఉన్న బంగారం, నగదును కుటుంబ సభ్యు లకు అందజేసిన 108 సిబ్బంది నిజాయితీని డాక్టర్లు, పోలీసులు, ప్రజలు అభినందిం చారు. వివరాల్లోకి వెళితే.. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని అం బేడ్కర్‌ చౌరస్తాలో సోమవారం సాయంత్రం చింతకాల పెంటయ్య అనే వ్యక్తి ఫిట్స్‌ వచ్చి అపస్మారక స్థితిలోకి పోయాడు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వెంటనే బాధితుడికి ప్రథమచికిత్స అందిం చి, నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆసుపత్రికి తరలిం చారు. అయితే, గంగారం గ్రామానికి చెందిన పెంటయ్య ఫిట్స్‌తో స్పృహ కోల్పో యి కింద పడిపోయినప్పుడు అతని వద్ద రెండు తులాల బంగారం, రూ.రెండు వేల నగదు ఉంది. గమనించిన 108 సిబ్బంది వాటిని డ్యూటీ డాక్టర్‌, పోలీసుల సమక్షంలో బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. విషయం తెలిసిన పలువురు 108 పైలెట్‌ జహంగీర్‌, శివకుమార్‌ల నిజాయితీని అభినందించారు.

Updated Date - Jun 10 , 2024 | 11:18 PM