Share News

- పట్టించుకోని అధికారులు

ABN , Publish Date - Mar 11 , 2024 | 10:42 PM

మండలంలోని అడవి సత్యారం గ్రామంలో తాగునీటి కొరత చాలా తీవ్రంగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- పట్టించుకోని అధికారులు
రైతు పొలంలో నీటిని తెచ్చుకుంటున్న గ్రామస్థులుఅడవి సత్యారంలో తాగునీటి కష్టాలు

మాగనూరు, మార్చి 11 : మండలంలోని అడవి సత్యారం గ్రామంలో తాగునీటి కొరత చాలా తీవ్రంగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్‌ గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా మండల, గ్రామ స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. 15 రోజుల నుంచి గ్రామంలో గల వాగులో వేసిన ఫిల్టర్‌ బోరులో నీరు రావడం లేదని, మిషన్‌ భగీరథ నీటి సరఫరా కూడా అంతంత మాత్రంగానే రావడం వల్ల గ్రామస్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామంలో రెండు బోర్లు ఉన్నా, ఒక బోరులో మోటర్‌ ఇరుక్కపోగా, మరో బోరులో నీళ్లు లేవని స్థానికులు తెలిపారు. ఈ విషయమై పలు మార్లు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో పొలాల్లో వేసిన బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని, లేకుంటే ఆందోళన చేయాల్సి వస్తోందని ప్రజలు తెలిపారు.

Updated Date - Mar 11 , 2024 | 10:43 PM