Share News

బంకుల్లో జనం బారులు

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:02 AM

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన భారతన్యాయ సంహిత కొత్త చట్టాన్ని నిరసిస్తూ, పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా చేసే ట్యాంకర్ల డ్రైవర్లపై చమురు సంస్థలు, డిపో యజమానులు ఆంక్షలు విధిస్తున్నారని, పెట్రోల్‌ సరఫరాలో డ్రైవర్లకు వెసులుబాటు కల్పించకుండా ఇష్టారాజ్యంగా నిబంధనలు అమలుచేస్తున్నారంటూ భారీ వాహనడ్రైవర్లు సమ్మెకు దిగారన్న వార్తలతో జిల్లాలోని పెట్రోలుబం

బంకుల్లో జనం బారులు

డీజిల్‌, పెట్రోల్‌ కోసం వాహనదారుల అగచాట్లు

డ్రైవర్ల సమ్మె వార్తలతో క్యూ

ఖమ్మం కలెక్టరేట్‌, జనవరి 2 : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన భారతన్యాయ సంహిత కొత్త చట్టాన్ని నిరసిస్తూ, పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా చేసే ట్యాంకర్ల డ్రైవర్లపై చమురు సంస్థలు, డిపో యజమానులు ఆంక్షలు విధిస్తున్నారని, పెట్రోల్‌ సరఫరాలో డ్రైవర్లకు వెసులుబాటు కల్పించకుండా ఇష్టారాజ్యంగా నిబంధనలు అమలుచేస్తున్నారంటూ భారీ వాహనడ్రైవర్లు సమ్మెకు దిగారన్న వార్తలతో జిల్లాలోని పెట్రోలుబంకులు రద్దీగా మారాయి. డీజిల్‌, పెట్రోల్‌ ట్యాంకర్ల డ్రైవర్లుకూడా సమ్మెలో ఉన్నారని, ఫలితంగా పెట్రోలు, డీజిల్‌ దొరకదన్న ప్రచారం జరుగడంతో మంగళవారం సాయంత్రం జిల్లాలోని పెట్రోలు బంకులకు వాహనదారులు పరుగులుతీశారు. ఈ క్రమంలో కొన్ని పెట్రోలు బంకుల్లో స్టాకు అయిపోగా.. కొన్ని బంకుల్లో వాహనదారుల రద్దీ కారణంగా ఒక్కో వ్యక్తికి రెండు లీటర్ల పెట్రోల్‌, 15 లీటర్ల డీజిల్‌ మాత్రమే పోశారని వాహనదారులు వాపోయారు. అయితే మంగళవారం రాత్రి డ్రైవర్లతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని, వారు సమ్మెను విరమించారని తెలియడంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - Jan 03 , 2024 | 12:02 AM