యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలి
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:52 PM
యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలని ఎంపీ బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని నేహ్రూయువ కేంద్రంలో, జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో శుక్రవారం వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

గణేశ్‌నగర్, జనవరి 12: యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలని ఎంపీ బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని నేహ్రూయువ కేంద్రంలో, జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో శుక్రవారం వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వివేకానంద చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ బండి సంజయ్‌కుమార్, కలెక్టర్ పమేలా సత్పతి హాజరై మాట్లాడారు. నెహ్రూ యువ కేంద్రం కరీంనగర్ కార్యాలయంలో ఎంపీ మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం ఆధ్యాత్మిక విలువలను చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అన్నారు. నేటి యువత ఆయనను స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని అన్నారు. మహా రాష్ట్ర నాసిక్ జరుగుతున్న 27వ నేషనల్ యూత్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో నెహ్రయువ కేంద్రంలో వీక్షించారు.
- కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ చికాగోలో ప్రపంచ మతాల సమ్మేళనంలో స్వామి వివేకానంద చేసిన ఉపన్యాసం ఇండియా యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. యువతరాన్ని ఉత్తేజపరిచి వారిలో స్ఫూర్తి నింపిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద అన్నారు. లేవండి, మేల్కొనండి, మీ లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి అనే ఆయన పిలుపు ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. వివేకానంద ఇచ్చిన సందేశాలు యువతకు అనుసర ణీయమన్నారు. లింగ సమానత్వం పాటించి అమ్మాయిలు, అబ్బాయిలు బాగా చదవి దేశానికి, సమాజానికి ఉపయో గపడాలని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతరం చేతుల్లోనే ఉందన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు, మెమొం టోలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ వెంకట రాంబాబు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి రాజవీరు, డీఆర్‌డీఏ శ్రీలత, జిల్లా వెనుకబడిన తరగతులు అభివృద్ధి అధికారి అనిల్ ప్రకాష్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి నేతనియల్, డీటీడబ్ల్యూఓ జనార్ధన్, నెహ్రూ యువ కేంద్రం ప్రోగ్రాం అధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.