Share News

యారన్‌ సబ్సిడీ సమస్య పరిష్కరించాలి

ABN , Publish Date - May 21 , 2024 | 12:15 AM

బతుకమ్మ చీరలను తయారు చేసిన మరమగ్గాల కార్మికులకు అందించే పదిశాతం యారన్‌ సబ్సిడీ సమస్యను పరిష్కరించాలని సీఐటీయూ తెలంగాణ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ డిమాండ్‌ చేశారు.

   యారన్‌ సబ్సిడీ సమస్య పరిష్కరించాలి
సిరిసిల్ల చేనేత జౌళిశాఖ ఎదుట ధర్నా చేస్తున్న మరమగ్గాల కార్మికులు

సిరిసిల్ల రూరల్‌, మే 20: బతుకమ్మ చీరలను తయారు చేసిన మరమగ్గాల కార్మికులకు అందించే పదిశాతం యారన్‌ సబ్సిడీ సమస్యను పరిష్కరించాలని సీఐటీయూ తెలంగాణ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని చేనేత జౌళిశాఖ కార్యాలయం ఎదుట సోమవారం యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరమగ్గాల కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. చేనేత జౌళిశాఖ ఏడీ సాగర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర చేనేత జౌళిశాఖ డైరెక్టర్‌ అలుగు వర్షిణి ఏకపక్ష నిర్ణయాలతో సిరిసిల్ల నేతన్నల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. 10 శాతం యారన్‌ సబ్సిడీ డబ్బులను తగ్గించకుండా వెంటనే అందించాలన్నారు. నేతన్నకు చేయూత (త్రిఫ్ట్‌) పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కార్మికులకు రావాల్సిన దాదాపు 10 నెలల పెండింగ్‌ డబ్బులను చెల్లించాలన్నారు. ఈ సమస్యను పరిష్కరించకుంటే ఈ నెల 24వ తేదీన సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ అధ్వర్యంలో హైదరాబాద్‌లోని కమిషనరేట్‌ను ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నక్క దేవదాస్‌, గుండురమేష్‌, కంది మల్లేశం, బెజుగం సురేష్‌, మూషం శంకర్‌, స్వర్గం శేఖర్‌, రవీందర్‌, పోచమల్లు, సదానందం, శ్రీనివాస్‌, రాజమౌళి, శ్రీధర్‌, నరేష్‌, దామోదర్‌, భాస్కర్‌, తిరుపతి, అశోక్‌, శేఖర్‌, విజయ్‌, సంపత్‌, శంకర్‌, రవి, వెంకటేష్‌, సత్యనారాయణ, రమేష్‌, సతీష్‌, లక్ష్మణ్‌, మల్లేశం, మనోహార్‌, కుమార్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2024 | 12:15 AM