Share News

హుజూరాబాద్‌ అభివృద్దికి కృషి

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:10 AM

హుజూరాబాద్‌ నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గిరిజన శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.

హుజూరాబాద్‌ అభివృద్దికి కృషి

హుజూరాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 1 : హుజూరాబాద్‌ నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గిరిజన శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఆదివారం వరంగల్‌ నుంచి ఆదిలాబాద్‌కు వెళ్తున్న క్రమంలో మండలంలోని సింగాపూర్‌ గ్రామంలోని కాంగ్రెస్‌నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జీ వొడితెల ప్రణవ్‌ నివాస గృహంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా వొడితెల ప్రణవ్‌ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులు, చేపట్టాల్సిన అభివృద్ది పనుల గురించి మంత్రికి వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పీసీసీ ఎస్సీ సెల్‌ మాజీ కన్వీనర్‌ దొంత రమేష్‌, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చందమల్ల బాబు, మాజీ సర్పంచ్‌ రఘుపాల్‌రెడ్డి, చందమల్ల నరేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 12:10 AM