Share News

కార్మికుల సమస్యలపై సంఘటితంగా పోరాడాలి

ABN , Publish Date - Jan 18 , 2024 | 11:39 PM

రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాడాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పిలుపునిచ్చారు.

కార్మికుల సమస్యలపై సంఘటితంగా పోరాడాలి

గోదావరిఖని, జనవరి 18: రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాడాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఎంప్లాయీస్‌ జనరల్‌ బాడీ సమావేశానికి జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌తో పాటు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ రైల్వేసంఘాలైన ఎన్‌ఎఫ్‌ ఐఆర్‌, ఎస్‌సీఆర్‌ ఏఎస్‌ఎస్‌ సంఘాలకు చెందిన నాయ కులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రైల్వే ప్రయాణి కులు సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుతున్నారంటే కార్మికుల పాత్ర ముఖ్య మైనదని, ప్రతి కార్మికుడు అంకిత భావంతో, నిబద్ధతతో పని చేస్తున్నారన్నారు. కార్మికుల సమస్యలపై సంఘాల నాయకులు ఎనలేని కృషి చేస్తున్నా రని, సమస్యలు పరిష్కారం కావాలంటే సంఘటితంగా పోరాటం చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని, కార్మికుల సంరక్షణ, అభివృద్ధి లక్ష్యంగా పని చేయాలని చెప్పా రు. రాబోయే రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టబోతుందని, పెడింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో మర్రి రాఘవయ్యతో పాటు విజయ్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 11:39 PM