Share News

లక్ష్యాన్ని సాధించేందుకు కఠినంగా శ్రమించాలి

ABN , Publish Date - May 22 , 2024 | 12:23 AM

అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు పోటీ పరీక్షల కోసం అభ్యర్థులు కఠోరంగా శ్రమించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు.

లక్ష్యాన్ని సాధించేందుకు కఠినంగా శ్రమించాలి

కరీంనగర్‌ కల్చరల్‌, మే 21: అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు పోటీ పరీక్షల కోసం అభ్యర్థులు కఠోరంగా శ్రమించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. వారధి సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర గ్రంఽథాలయంలో గ్రూప్‌-1 అభ్యర్థులకు నిర్వహించిన ఉచిత తొలి మాక్‌ టెస్ట్‌ను ఆమె మంగళవారం పరిశీలించారు. ఎంత మంది అభ్యర్థులు హాజరవుతున్నారని, ఎన్ని టెస్ట్‌లు పెడుతున్నారని అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూన్‌ 9న జరుగనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు అభ్యర్థులు అందరూ హాజరు కావాలని అన్నారు. గ్రంధాలయంలో చేపడుతున్న నూతన భవన నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 300 మంది మాక్‌ టెస్ట్‌కు హాజరయ్యారని, ఈ నెల 25, 29, జూన్‌ 3, 7 తేదీల్లో మరో నాలుగు మాక్‌ టెస్ట్‌లు నిర్వహించనున్నట్లు వారధి, గ్రంథాలయ సంస్థ బాధ్యులు కలెక్టర్‌కు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ పర్సన్‌ ఇన్‌చార్జ్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, వారధి సొసైటీ సెక్రెటరీ జి ఆంజనేయులు, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సరిత, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2024 | 12:23 AM