Share News

మహిళలు ఆర్థికంగా ఎదగాలి..

ABN , Publish Date - Aug 15 , 2024 | 12:33 AM

మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అందిస్తు న్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు.

మహిళలు ఆర్థికంగా ఎదగాలి..

ముత్తారం, ఆగస్టు 14 : మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అందిస్తు న్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం ముత్తారం మండలంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ జే.అరుణశ్రీతో కలిసి పర్యటించారు. మండ లంలోని మైదంబండ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల, అడవిశ్రీరాంపూర్‌లో ని జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. పాఠశాలల్లోని తరగతి గదుల లో విద్యాబోధనను తనిఖీచేసి విద్యార్థుల ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉపా ధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అడవిశ్రీరాంపూర్‌ జడ్పీహెచ్‌ ఎస్‌ ప్రహారీ గోడ మరమ్మతులకు అవసరమైన అంచనాలను రూపొందించి ప్రతి పాదనలు సమర్పించాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అడవి శ్రీరాం పూర్‌ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలోని విద్యార్థులకు కలెక్టర్‌ టీ షర్ట్‌లు అందజేశారు.

మిల్క్‌ పార్లర్‌ ప్రారంభం..

మండల కేంద్రంలో ఇందిరా మహిళాశక్తి కార్యక్రమం కింద శ్రీరాజమాత గ్రామ సంఘం ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన మిల్క్‌ పార్లర్‌ను కలెక్టర్‌ ప్రారంభిం చారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద స్వశక్తి మహిళా సంఘాలకు బ్యాం కు ద్వారా రుణాలు అందజేసి వారి వ్యాపార యూనిట్ల ఏర్పాటుచేసేందుకు ప్రభు త్వం కృషి చేస్తుందన్నారు. జిల్లాలో 12 రకాల వివిధ వ్యాపార యూనిట్ల ఏర్పా టుకు మహిళలకు అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నామని, మహిళా సంఘాలచే మీసేవ కేంద్రాలు ఆహార శుద్ధి కేంద్రాలు, పౌలీ్ట్ర యూనిట్‌ మొదలగు వివిధ వ్యాపార యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందిరా మహి ళా శక్తి కార్యక్రమం కింద లక్షా 90 వేల రుణంతో ముత్తారంలో మిల్క్‌ పార్లర్‌ ఏర్పాటు చేశామని, దీనినే సమర్థవంతంగా నిర్వహించుకొని మహిళలు ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలవాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ అవకాశాలను వినియోగించుకుంటూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధన దిశ గా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఇసుక రీచ్‌ పరిశీలన..

ముత్తారం మండలంలో ఖమ్మంపల్లి గ్రామంలో ఇటీవలే ప్రారంభించిన ఇసుక రీచ్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ పర్యటనలో కలెక్టర్‌ వెంట జిల్లా గ్రామీణ అభి వృద్ధి అధికారి రవీందర్‌ రాథోడ్‌, మైనింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, ముత్త్తారం ఎంపీడీవో జి లలిత, మండల పంచాయతీ అధికారి బి కిరణ్‌, పంచాయతీరాజ్‌ శాఖ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఎం.వరలక్ష్మీ, ఎడిఎం డి .పద్మ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2024 | 12:33 AM