ఏపీఎం కార్యాలయం ఎదుట మహిళల ఆందోళన
ABN , Publish Date - May 26 , 2024 | 12:30 AM
స్థానిక ఐకేపీ ఏపీఎం కార్యాల యం ఎదుట పొదుపు సంఘాల మహిళలు శనివా రం ఆందోళనకు దిగారు.
మంథని, మే 25: స్థానిక ఐకేపీ ఏపీఎం కార్యాల యం ఎదుట పొదుపు సంఘాల మహిళలు శనివా రం ఆందోళనకు దిగారు. మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన జ్యోతి గ్రామైఖ్య మహిళా సంఘం సభ్యులు పొదుపు సంఘాల్లోని డబ్బులను వాడుకుంటున్నారంటూ ఆరోపిస్తూ ఆందోళనకు దిగి అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ.. జ్యోతి గ్రామైఖ్య మహిళా సంఘంలో 23గ్రూప్‌ల సభ్యులం పొదుపు చేసుకుం టున్నామన్నారు. తమ సంఘంలో ఉన్న డబ్బుల వివరాలను సభ్యులెవరికీ చెప్పడం లేదన్నారు. సంఘానికి సీఎగా రాధారపు భాగ్యలక్ష్మి, అధ్యక్షురా లిగా బాసాని లక్ష్మి, కార్యదర్శిగా బిరుదు జ్యోతి, కోశా ధికారిగా మాదరి పద్మలు వ్యవహరిస్తున్నారని, వీరె వరు కూడా సంఘానికి సంబంధించిన విషయాలను సభ్యులకు చెప్పడం లేదన్నారు. తమ సంఘానికి సంబంధించి అధ్యక్షురాలి దగ్గర చెక్‌బుక్ ఉన్నప్పటికీ సీఏ మరో చెక్‌బుక్ తీసుకొని రూ.1.30లక్షలు విత్‌డ్రా చేశారన్నారు. సభ్యులెవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డబ్బులు ఎలా విత్‌డ్రా చేశారని ప్రశ్నిస్తే సీఏ జీతం చెల్లించేందుకు విత్‌డ్రా చేసినట్లు అధికా రులు వెల్లడిస్తున్నారన్నారు. మూడు సంవత్సరాలుగా తమ గ్రామంలోని గ్రూప్‌ల కు పొదుపు, రుణాలు ఇవ్వ డం లేదు. లోన్లు, పొదు పు లేనప్పుడు తాము సీఏకు జీతం ఎందుకు ఇవ్వాలన్నా రు.తమ సంఘంలో దాదాపు రూ.30 లక్షల వరకు నగదు ఉండగా అందులో రూ. 10 లక్షల వరకు గ్రామంలోని మహిళలకు రుణాలు ఇచ్చా రని, ఇందులో ఎంత మంది కడుతున్నారు అనే విషయా లు కూడా ఏం తెలియనివ్వ డం లేదన్నారు. దీనివల్ల తమ గ్రామంలో ఉన్న మహిళలమంతా నష్టపోతు న్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై ఉన్నతాధకారులు స్పందించి వెంటనే తమకు న్యాయం చేయాలని వారు కోరారు.