Share News

పదోన్నతులతో బాధ్యత పెరుగుతుంది

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:40 PM

పోలీస్‌శాఖలో పదోన్నతుల ద్వారా స్థాయితో పాటు బాధ్య తలు కూడా పెరుగుతాయని, బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజ ల్లో పోలీస్‌శాఖ పట్ల విశ్వాసాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా నడుచుకోవాలని రామగుండం సీపీ రెమ రాజేశ్వరి సూచించారు.

పదోన్నతులతో బాధ్యత పెరుగుతుంది

కోల్‌సిటీ, జనవరి 12: పోలీస్‌శాఖలో పదోన్నతుల ద్వారా స్థాయితో పాటు బాధ్య తలు కూడా పెరుగుతాయని, బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజ ల్లో పోలీస్‌శాఖ పట్ల విశ్వాసాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా నడుచుకోవాలని రామగుండం సీపీ రెమ రాజేశ్వరి సూచించారు. శుక్రవారం కమిషనరేట్‌ పరిధిలో ఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన 8మంది, ఏఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన 10మంది, హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన 19మందిని తన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కష్టపడి పని చేసి పోలీస్‌ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రజ లకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కష్టపడి పని చేస్తే ఎప్పటి కైనా మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిం చాలని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారన్నారు. మాన సికంగా, శారీరకంగా ఒత్తిడిని దూరం చేయడానికి ప్రతి ఒక్కరూ శ్రమించా లని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు బోర్ల కుంట పోచలింగం ఉన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:40 PM