Share News

గొర్రెలు వచ్చేనా?

ABN , Publish Date - Jan 10 , 2024 | 01:11 AM

‘అదిగో గొర్రెలు.. ఇదిగో గొర్రెలు’ అంటూ గత బీఆర్‌ఎస్‌ సర్కారు గొల,్ల కుర్మలకు నిరీక్షణ మిగిల్చింది. గొల్లకుర్మలకు ఆర్థిక చేయూతనం దించేందుకు గత ప్రభుత్వం గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. మొదటి విడత ఎట్టకేలకు పంపిణీ చేసినా రరెండో విడతలో గొర్రెల కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు.

గొర్రెలు వచ్చేనా?

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

‘అదిగో గొర్రెలు.. ఇదిగో గొర్రెలు’ అంటూ గత బీఆర్‌ఎస్‌ సర్కారు గొల,్ల కుర్మలకు నిరీక్షణ మిగిల్చింది. గొల్లకుర్మలకు ఆర్థిక చేయూతనం దించేందుకు గత ప్రభుత్వం గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. మొదటి విడత ఎట్టకేలకు పంపిణీ చేసినా రరెండో విడతలో గొర్రెల కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు. గత సంవత్సరం సెప్టెంబరు 30లోగా గొర్రెల పంపణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం హడావుడి చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాను కేటాయించి అక్కడి నుంచి గొర్రెల యూనిట్లను తెచ్చి పంపిణీ చేపట్టింది. పంపిణీ పూర్తవుతుందనుకున్న దశలోనే ఎన్నికల కోడ్‌ రావడంతో గొర్రెల పంపిణీకి బ్రేక్‌ పడింది. కొత్త ప్రభుత్వం రావడంతో గత ప్రభుత్వంలో అర్ధంతరంగా నిలిచిపోయిన గొర్రెల పంపిణీ కొనసాగుతుందో? లేదా? అనే లబ్ధిదారుల్లో సందిగ్ధం నెలకొంది.

జిల్లాలో 16,162 మంది లబ్ధిదారుల ఎంపిక

గొల్ల, కుర్మల ఆర్థికాభివృద్ధికి గత ప్రభుత్వం గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల పరిధిలోని 190 గొర్రెల సహకార సంఘాల్లోని సభ్యుల్లో రెండు విడతలుగా డ్రా పద్ధతిలో లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. జిల్లాలో రెండు విడతలకు సంబంధించి 16,182 మంది ఎంపికయ్యారు. ఇందులో ఇప్పటి వరకు 12,112 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను అందించారు. గొర్రెల యూనిట్ల కోసం 2017- 2018లో ప్రారంభించిన ఈ పథకం కోసం లబ్ధిదారులు నిరీక్షిస్తూనే ఉన్నారు. గొల్ల కుర్మల ఆందోళనలు వ్యక్తం అవుతున్న దశలో యూనిట్ల పంపిణీ ప్రారంభించడం, మళ్లీ నిలిచిపోవడం పరిపాటిగా మారింది. మొదటి విడత గొర్రెల పంపిణీ ఏదో విధంగా పూర్తి చేసినా రెండో విడత మాత్రం లబ్ధిదారుల సహనాన్ని పరీక్షిస్తూనే ఉన్నారు.

జిల్లాలో మొదటి విడతలో 8137 యూనిట్ల లక్ష్యానికిగా 7517 యూనిట్లను పంపిణీ చేశారు. రెండో విడతలో 8033 యూనిట్ల పంపిణీ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 3983 యూనిట్లను పంపిణీ చేశారు. ఎన్నికలకు ముందు 2023 మంది లబ్ధిదారులు తమ వాటాధనాన్ని చెల్లించారు. ఇందులో కేవలం 570 గ్రౌండింగ్‌ చేసి పంపిణీ చేశారు. సెప్టెంబరులోగా పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని అడుగులు వేసినా మళ్లీ నిలిచిపోయింది. వాటాధనం చెల్లించిన లబ్ధిదారులు గొర్రెల కోసం ఎదురు చూస్తున్నారు. గొర్రెల పంపిణీకి ప్రధానంగా కొరతేనని భావిస్తున్నారు. ఆంధ్రాలోని కర్నూలు, అనంతపూర్‌ జిల్లాలతోపాటు పలు ప్రాం తాల్లో గొర్రెల కోసం అన్వేషించినా దొరకని పరిస్థితి ఉండడంతోనే నత్తనడకగా సాగిందని భావిస్తున్నారు.

గొర్రెల పంపిణీలో అవకతవకలు

జిల్లాలో మొదటి విడత గొర్రెల పంపిణీలో అనేక అవకతవకలు వెలుగు చూశాయి. కడప జిల్లా నుంచి గొర్రెలను తీసుకురావడం మళ్లీ గొర్రెలను ఆంధ్రాకు పంపించడంతో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రా, తెలంగాణల మధ్య గొర్రెలు చక్కర్లు కొట్టాయి. అనేక సందర్భాల్లో గొర్రెలను పట్టుకోవడంతోపాటు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారితో పాటు మండల అధికారి కూడా సస్పెండ్‌కు గురైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని రెండో విడతలో పకడ్బందీగా పంపిణీ చేయడానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జియో ట్యాగింగ్‌తోపాటు ప్రతీ గొర్రెకు బీమా సౌకర్యాన్ని కల్పించారు. గొర్రెల కొనుగోలు సమీపంలోని మార్కెట్లను మ్యాపింగ్‌ చేశారు. ప్రత్యేక కమిటీలు కూడా వేశారు.

75 శాతం రాయితీ

గొర్రెల పంపిణీలో యూనిట్‌ ధరను గత ప్రభుత్వం పెంచింది. 75 శాతం లబ్ధిదారుడికి రాయితీ లభించనుంది. 25 శాతం డీడీ రూపంలో వాటాధనం చెల్లించాల్సి ఉంటుంది. గతంలోనే జిల్లాలో 190 సొసైటీల్లో 18 సంవత్సరాలు నిండిన గొల్ల కుర్మలను సభ్యులుగా చేర్చుకొని డ్రా పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేశారు. గతంలో ఒక యూనిట్‌ ధర రూ.1.25 లక్షలు ఉండగా ఇందులో 75 శాతం సబ్సిడీ, 25 శాతం లబ్ధిదారుడి వాటా కింద చెల్లించారు. ప్రస్తుతం యూనిట్‌ ధరను పెంచారు. రూ.50 వేల వరకు పెంచి 1.75 లక్షలు చేశారు. ఇందులో లబ్ధిదారుడి వాటా 25 శాతం కింద రూ .43,750 చెల్లించాలి. 2023 మంది లబ్ధిదారులు వాటా ధనం చెల్లించి గొర్రెల కోసం నిరీక్షిస్తున్నారు.

Updated Date - Jan 10 , 2024 | 01:11 AM