పత్తి ధర పెరుగుతుందా.. తగ్గుతుందా
ABN , Publish Date - Apr 22 , 2024 | 12:50 AM
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో గడిచిన పది రోజుల వ్యవధిలో పత్తి ధర క్వింటాల్‌కు మూడు వందల రూపాయలు తగ్గింది. ఈ నెల 10 వరకు క్వింటాల్‌కు 7,650 రూపాయలు పలికింది. పత్తి ధరలు పెరుగడంతో రైతులు కొంత మేర సంతోషం వ్యక్తం చేశారు.
జమ్మికుంట, ఏప్రిల్ 21: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో గడిచిన పది రోజుల వ్యవధిలో పత్తి ధర క్వింటాల్‌కు మూడు వందల రూపాయలు తగ్గింది. ఈ నెల 10 వరకు క్వింటాల్‌కు 7,650 రూపాయలు పలికింది. పత్తి ధరలు పెరుగడంతో రైతులు కొంత మేర సంతోషం వ్యక్తం చేశారు. పెట్టుబడుల కోసం ఇళ్లలో నిల్వలు చేసుకున్న పత్తిని విక్రయించుకునేందుకు ఆసక్తి కనబరిచారు. ఇటీవల మార్కెట్‌కు వరుస సెలవు దినాలు రావడంతో నెమ్మదిగా అమ్ముకుందామని భావించారు. ఇంతలో ధరలు తగ్గుముఖం పట్టడంతో పత్తి అమ్ముకునేందుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. బేళ్లు, గింజలు, నూనె ధరలు నిలకడగా ఉన్నప్పటికి ధరలు తగ్గడంపై రైతులు ఆలచనలో పడ్డారు. వరంగల్ మార్కెట్లో గడిచిన నెల రోజుల వ్యవధిలో పత్తి ధరలు 7,300 రూపాయలకు మించలేదు. జమ్మికుంటలో 7,650 రూపాయల వరకు ధర పలికింది. స్థానికంగా పెరిగిన ధరలు వ్యాపారులు కృత్రిమంగా పెంచారనే విమర్శలు ఉన్నాయి. గరిష్ఠ ధర 7,650 రూపాయలు ఒకరిద్దరు రైతుల పత్తికి మాత్రమే చెల్లించి, మిగితా రైతులకు 7,350లోపు చెల్లింస్తుంటారు. సోమవారం నుంచి పత్తి ధరలు తగ్గుతాయ, పెరుగుతాయా అని రైతుల్లో ఉత్కంఠ నెలకొంది.