Share News

లోపం ఎక్కడ..

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:02 AM

జిల్లాలోని కథలాపూర్‌ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 120 మంది విద్యా ర్థులుండగా కేవలం 37 మంది విద్యార్థులు మాత్రమే పాస్‌ అయ్యారు. కళాశాల కేవలం 31శాతం ఉత్తీర్ణతను సాధించింది. ప్రథమ సంవత్సరం లో 157 మంది విద్యార్థులుండగా కేవలం 17 మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. కేవలం 10.82 శాతం ఉత్తీర్ణతను కళాశాల సాధించింది.

లోపం ఎక్కడ..

ఇంటర్‌ ఫలితాలపై పోస్టుమార్టం

- పూర్‌ ఫలితాలు సాధించిన జగిత్యాల

- నిరుత్సాహానికి గురవుతున్న తల్లిదండ్రులు

విద్యాశాఖ అధికారుల సమీక్ష

జగిత్యాల, మే 26 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని కథలాపూర్‌ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూని యర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 120 మంది విద్యా ర్థులుండగా కేవలం 37 మంది విద్యార్థులు మాత్రమే పాస్‌ అయ్యారు. కళాశాల కేవలం 31శాతం ఉత్తీర్ణతను సాధించింది. ప్రథమ సంవత్సరం లో 157 మంది విద్యార్థులుండగా కేవలం 17 మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. కేవలం 10.82 శాతం ఉత్తీర్ణతను కళాశాల సాధించింది.

ఫ జిల్లాలో రాయికల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్ర థమ సంవత్సరంలో 63 మంది విద్యార్థులుండగా కేవలం ఒకే ఒక్క వి ద్యార్థి పాస్‌ అయ్యాడు. 62 మంది విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. కళా శాల రెండు శాతం ఉత్తీర్ణత సాధించింది. ద్వితీయ సంవత్సరంలో 63 మంది విద్యార్థులకు గాను 15 మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. కళా శాల 24 శాతం ఉత్తీర్ణతను సాధించింది.

్జఫ జిల్లాలోని కొడిమ్యాల జూనియర్‌ కళాశాలలో సెకండియర్‌లో 97 మంది విద్యార్థులుండగా కేవలం 11 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కళాశాల 11 శాతం ఉత్తీర్ణతను సాధించింది. అదేవిదంగా ఫస్ట్‌ ఇయర్‌లో 83 మంది విద్యార్థులుండగా 12 మంది పాస్‌ అయ్యారు. కళాశాల 14 శా తం ఉత్తీర్ణతను సాధించింది. ఇలా జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఫలితాల్లో చాల వెనుకబడ్డాయి.

ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో జగిత్యాల జిల్లా వెరీ పూర్‌గా మారింది. చా వు తప్పి కన్నులొట్ట అన్న చందంగా తయారైంది జిల్లా ఇంటర్మీడి యట్‌ విద్యాశాఖ పరిస్థితి. ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో గణమైన స్థానం పదిలం చే సుకుంటున్న జిల్లా అంచనాలను తలకిందులు చేస్తూ దిగువకు జారడం విద్యాభిమానులను నిరాశకు గురిచేస్తోంది. జిల్లా ఇంటర్‌ ద్వితీయ సంవ త్సర ఫలితాల్లో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలవగా, ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 25వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంతో పోలిస్తే ఫస్టియర్‌లో కూడా ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఇదిలా ఉండగా ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు. ప్రభుత్వ కాలేజీల్లో ఫలితాలు చాలా వెనుక బడ్డాయి. గురుకుల కళాశాలలు, సోషల్‌ వెల్ఫేర్‌, కేజీబీవీ, ఎంజేపీ, మైనా ర్టీ కళాశాలల్లో కొంత ఆశాజనకంగా ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వ గురు కుల కళాశాలల్లో వంద శాతం ఫలితాలు వచ్చాయి. ఈ సారి ప్రైవేటు కళాశాలల జోరు సైతం తగ్గడం పట్ల తల్లిదండ్రులు నిరుత్సాహానికి గుర వుతున్నారు. కళాశాలలో స్వల్ప సంఖ్యలో మాత్రమే విద్యార్థులు అధిక మార్కులు సాధించగా, చాలా మంది విద్యార్థులు కనీసం ఉత్తీర్ణత కాకపోవడం విశేషం.

మెరుగుపడని ఫలితాలు...

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ ఫలితాలు నిరాశ పర్చాయి. ఇటీవల ఇంటర్‌ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో ద్వితీయ సంవ త్సరం ఫలితాల్లో 64.29 శాతం, ప్రథమ సంవత్సరంలో 51.69 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో ద్వితీయ సంవత్సరంలో 73.49 శాతం ఉత్తీర్ణత కాగా, ప్రథమ సంవత్సరంలో 63.31 శాతం ఉత్తీర్ణత సాధించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా దిగువకు...

జిల్లాలో ఇంటర్‌ ఫలితాలు గతంలో ఎన్నడూ లేని విధంగా దిగువకు వెళ్లాయి. గత యేడాది జిల్లాలో ద్వితీయ సంవత్సరంలో 68 శాతం ఉత్తీర్ణత లభించింది. ప్రథమ సంవత్సరంలో 58 శాతం ఉత్తీర్ణత వచ్చింది. గత యేడాదితో పోలిస్తే సుమారు 4 శాతం ద్వితీయ సంవత్సర ఫలి తాలు, సుమారు 7 శాతం ప్రథమ సంవత్సరం ఫలితాలు దిగువకు జారా యి. దాదాపుగా నాలుగు, అయిదు సంవత్సరాలు ఇంత తక్కువ శాతం ఉత్తీర్ణత ఫలితాలు జిల్లాలో రాలేవని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి.

ప్రభుత్వ, ప్రైవేటు తేడా లేకుండా...

జిల్లాలో ప్రస్తుత యేడాది ఇంటర్‌ ఫలితాలు ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా అన్ని కళాశాలల్లోనూ నిరాశజనకంగానే వచ్చాయని తల్లి దండ్రులు అంటున్నారు. జిల్లా సగటు ఉత్తీర్ణత 64 శాతం ఉండగా, ప్ర భుత్వ కళాశాలల్లో సుమారు 54 శాతం, ప్రైవేటు కళాశాలల్లో సుమారు 62 శాతం ఫలితాలు వచ్చాయి. కేజీబీవీలు, మోడల్‌ స్కూల్స్‌, రెసిడె న్షియల్స్‌ కళాశాలలో సుమారు 70 శాతం, గురుకుల కళాశాలల్లో 99 శా తం ఫలితాలు వచ్చాయి. జిల్లాలో పలు ప్రైవేటు కళాశాలల్లో సైతం సగ టు కంటే తక్కువగానే ఫలితాలు వచ్చాయని పలువురు విశ్లేషిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఒకటి రెండు కళాశాలలు మినహా మిగిలిన కళాశా ల లు ఏవీ కూడా జిల్లా సగటు ఉత్తీర్ణత శాతమైన 64 కంటే ఎక్కువగా సాధించలేవని అంటున్నారు.

కలెక్టర్‌ ఆగ్రహం..

జిల్లాలో ఇంటర్‌ రిజల్ట్స్‌ నిరాశజనకంగా వచ్చాయని కలెక్టర్‌ షేక్‌ యా స్మిన్‌ భాషా సంబందిత శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంత తక్కువగా ఫలితాలు రావడం పట్ల అసంతృప్తిని వ్య క్తం చేయడంతో పాటు సంబంధిత అధ్యాపకుల పనితీరుపై ఆగ్రహం చెందినట్లుగా అధికార వర్గాలు అంటున్నాయి. ఫలితాలు క్షీణించడానికి బాధ్యులపై అవసరమైన మెమోలు జారీ చేయడం గానీ, బదిలీలు వంటి చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ఇంటర్‌ విద్యా వర్గాల్లో వినిపి స్తోంది.

ఎన్నెన్నో కారణాలు..

జిల్లాలో కరోనా ప్రభావ పరిస్థితి ఉన్న సమయంలో పదో తరగతి బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు ప్రస్తుతం సీనియర్‌ ఇంటర్‌ పూర్తి చేసుకుం టున్నారని ఇంటర్‌ విద్యాశాఖ అధికార వర్గాలు అంటున్నాయి. కరోనా కా రణంగా అప్పటి కాలంలో సరియైున బోధన లేకపోవడం, అభ్యసన జరగక పోవడం ఫలితాల శాతం తగ్గడానికి కారణంగా భావిస్తున్నారు. కరోనా సమయంలో మూడేళ్లు విద్యాభ్యాసం అంతంతమాత్రంగా ఉండడం కార ణంగా తెలుస్తోంది. విద్యాశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం సైతం ఫలితాలపై ప్రభావం చూపిందన్న చర్చలు జరుగుతున్నాయి. కళాశాల విద్యార్థులకు మధ్యాహ్నా భోజనం అమలు చేయకపోవడం సైతం కారణం గా బావిస్తున్నారు. గత యేడాది పలు వురు కాంట్రాక్టు లెక్చరర్లను ప్రభు త్వం రెగ్యులరైజ్‌ చేసింది..మరింత సమర్థవంతంగా ఫలితాలు తీసుకొని రావాల్సి ఉండగా, ఫలితాలు క్షీణించడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అడ్వాన్స్‌ సప్లిమెంటరీపై సన్నద్ధత...

అనుత్తీర్ణులైన విద్యార్థుల సన్నద్ధతపై ఇంటర్‌ విద్యా అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఉత్తీర్ణత శాతం మెరుగయ్యేలా అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఒకటి రెండు సబ్జెక్టులతో పాటు తక్కువ మార్కులతో ఫెయిల్‌ అయిన విద్యార్థు లను గుర్తించారు. వారిపై మరింత శ్రద్ధ చూపడం, సబ్జెకులపై భయం తొలిగిపోయేల ధైర్యం చెప్పడం, ఆత్మ విశ్వాసంతో అభ్యసన సాగించేలా ప్రోత్సహించనున్నారు. మే 24 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఉండగా, ఆలోపు సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

ఫలితాలు దిగజారడంపై సమీక్షిస్తున్నాము

- నారాయణ, జిల్లా ఇంటర్‌ విద్యాధికారి

జిల్లాలో గతంతో పోలిస్తే ఇంటర్‌ ఫలితాలు దిగజారాయి. ఇందుకు గల కారణాలపై దృష్టి సారించాము. కళాశాల వారిగా, సబ్జెక్టుల వారిగా సమీక్షిస్తున్నాము. ఇప్పటికే కలెక్టర్‌కు అవసరమైన ఫలితాల వివరాలను అందించాము. రాష్ట్ర స్థాయి అధికారులు సైతం వెబ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఫలితాలు మెరుగుపడడానికి అవసరమైన చర్యలు తీసు కోవడంపై దృష్టి సారించాము.

Updated Date - Apr 27 , 2024 | 01:02 AM