Share News

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎప్పుడు?

ABN , Publish Date - May 15 , 2024 | 12:16 AM

విద్యా సంవత్సరం చివరి దశకు చేరుకున్నా ఫీజు రీ యింబర్స్‌మెంట్‌ అందలేదు. 2022 నుంచి బకాయిలు ఉన్నాయి. బీసీ సంక్షేమ శాఖలోనే 114 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి.

 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎప్పుడు?

గణేశ్‌నగర్‌, మే 14: విద్యా సంవత్సరం చివరి దశకు చేరుకున్నా ఫీజు రీ యింబర్స్‌మెంట్‌ అందలేదు. 2022 నుంచి బకాయిలు ఉన్నాయి. బీసీ సంక్షేమ శాఖలోనే 114 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో విద్యార్థలు, కళాశాలల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రీ యింబర్స్‌మేంట్‌, స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం మూడేళ్లుగా విడుదల చేయకపోవడంతో బకాయిల బారం పెరిగింది.

బీసీ సంక్షేమ శాఖలో మూడేళ్లలో స్కాలర్‌షిప్‌( ఎంటీఎఫ్‌) కింద 34,102మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి మొత్తం 3.34 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉంది. ఈబీసీ కేటగిరీలో ఫీజు రీ యింబర్స్‌మెంట్‌(ఆర్టీఎఫ్‌) కింద 3.755 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి 96.35 కోట్లు రావాల్సి ఉంది. ఈబీసీ ఆర్టీఎఫ్‌ కింద 13.69 కోట్ల బకాయిలున్నాయి. 35 కోట్లపె ౖచిలుకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు బకాయిలు రావాల్సి ఉంది. గతడాది ఆగస్టులో నిధులు విడుదలైనా విద్యార్థుల ఖాతాల్లో జమకాలేదు. విద్యాసంవత్సరం ముగుస్తుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

ఫ విద్యార్థులను ఇబ్బంది పెడితే ఉరుకోం

నారోజు రాకేష్‌, బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాల ర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులను ఇబ్బంది పెడితే ఊరుకోం. ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలి.

ఫ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించాలి

మాదం తిరుపతి, యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి

విద్యార్థులకు ప్రభుత్వం మూడు సంవత్సరాల నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిండం లేదు. ప్రభుత్వం బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. లేకపోతే ఆందోళనలు నిర్వహిస్తాం.

Updated Date - May 15 , 2024 | 12:16 AM