Share News

కవితకు పట్టిన గతే ఎంపీ అర్వింద్‌కు పడుతుంది

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:30 AM

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మాట తీరు, వ్యవహారశైలిని మార్చుకోకుండా అహంకా రంతో తిరిగితే కవితకు పట్టన గతే ఆయనకు పడుతుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్‌ అన్నారు. సోమవారం పట్ట ణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

కవితకు పట్టిన గతే ఎంపీ అర్వింద్‌కు పడుతుంది
సమావేశంలో మాట్లాడుతున్న మధు యాష్కి గౌడ్‌

- టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కి గౌడ్‌

మెట్‌పల్లి, ఏప్రిల్‌, 29: నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మాట తీరు, వ్యవహారశైలిని మార్చుకోకుండా అహంకా రంతో తిరిగితే కవితకు పట్టన గతే ఆయనకు పడుతుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్‌ అన్నారు. సోమవారం పట్ట ణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ దేశంలో మళ్లీ మోదీకి ఓటు వేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, రిజర్వేషన్లతో పాటు మైనార్టీ రిజర్వేష న్లనూ వ్యతిరేకించిన ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ లకు వేసినట్లేనని అన్నారు. ఎంపీ అర్వింద్‌ తీరు మార్చుకోకుంటే రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని విమర్శించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మే 1న చౌలమద్ధి శివారులోని సీఎం రేవంత్‌ సభకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు జువ్వాడి కృష్ణారావు, జెట్టి లింగం, తిప్పిరెడ్డి అంజిరెడ్డి, కొమిరెడ్డి లింగారెడ్డి, ఆకుల లింగారెడ్డి, పూదరి నర్సాగౌడ్‌, కొమ్ముల సంతోష్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 12:30 AM