Share News

పెళ్లి సందడి

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:57 AM

జిల్లాలో వివాహాల కోలాహలం ఆరంభం కానుంది. ఈనెల 11వ తేదీ నుంచి మాఘ మాసం ప్రారంభం అవుతుండడంతో మంచి ముహూర్తాల్లో పెళ్లిళ్లు జరిపించడానికి తల్లిదం డ్రులు సిద్ధమవుతున్నారు.

పెళ్లి సందడి

జగిత్యాల, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివాహాల కోలాహలం ఆరంభం కానుంది. ఈనెల 11వ తేదీ నుంచి మాఘ మాసం ప్రారంభం అవుతుండడంతో మంచి ముహూర్తాల్లో పెళ్లిళ్లు జరిపించడానికి తల్లిదం డ్రులు సిద్ధమవుతున్నారు. మాఘ మాసం నుంచి శ్రీకోధి నామ సంవత్సర చైత్ర మాసం వరకూ అంటే ఏప్రిల్‌ 20వ తేదీ వరకు మూడు నెలల్లో మంచి ముహూర్తాలున్నాయి. సుమారు రెండు నెలల విరామం అనంత రం మళ్లీ వివాహాలు మొదలు అవుతుండడంతో కల్యాణ మండపాల వద్ద పెళ్లి బృందాల సందడి మొదలు కానుంది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాం తాల్లో మూడుముళ్లతో వందల సంఖ్యలో నవ జంటలు ఒక్కటి కానున్నా యి. ఇందుకు అనుగుణంగా యువతీ యువకుల తల్లిదండ్రులు ముంద స్తు పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నారు.

శుభ ఘడియలు..ఇవే

వివాహానికి యోగ్యమైన ముహూర్తాలను పండితులు సూచిస్తున్నారు. మాఘ మాసం ప్రారంభం తదుపరి ఈనెల 13వ తేదీ, 14, 17, 18, 24, 28, 29 తేదీల్లో పలు ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. వచ్చే నెల 2, 3వ తేదీల్లో సైతం వివాహాలు జరిపించుకునే అవకాశాలు న్నాయంటున్నారు. పాల్గుణ మాసం మార్చి 15వ తేదీన, 17, 20, 22, 24, 25, 27, 28, 30 ఏప్రిల్‌లో 3, 4 తేదీలు వివాహ ముహూర్తాలున్నాయని అంటున్నారు. దీంతో పాటు చైత్ర మాసమైన ఏప్రిల్‌లో 9వ తేదీ, 18, 19, 20, 21, 22, 24, 26 తేదీల్లో వివాహాలు జరిగే అవకాశాలున్నాయని పం డిత వర్గాలు అంటున్నాయి. ఏప్రిల్‌ 28వ తేదీ నుంచి మూఢం ప్రారంభం కానుంది. తిరిగి శ్రావణ మాసం వరకు అంటే ఆగస్టు వరకు వివాహ ము హూర్తాలు లేవని పురోహితులు వివరిస్తున్నారు.

పంక్షన్‌ హాళ్లు..క్యాటరింగ్‌ ముందస్తు బుకింగ్‌లు...

జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనుండడంతో తల్లిదం డ్రులు ముందస్తు పనులపై దృష్టి సారించారు. పంక్షన్‌ హాళ్లు, క్యాటరింగ్‌, పురోహితులు, భాజా భజంత్రీలు, ఆర్కేస్ట్రా, డెకరేషన్‌, ఫొటో గ్రఫీ, వీడి యో గ్రఫీ, ఫ్రీ వెడ్డింగ్‌ షూట్‌ స్టుడియోలు ఇలా పెళ్లికి అవసరమైన వాటి ని ముందస్తుగా బుక్‌ చేసుకోవడంపై దృష్టి సారించారు. వివాహాలకు అవ సరమైన పట్టు వస్త్రాలు, దుస్తులు, బంగారు ఆభరణాలు ముందస్తు కొను గోలు చేస్తున్నారు. అలాగే ముందస్తుగానే ఫంక్షన్‌హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు బుక్‌ చేసుకోవడం పై దృష్టి సారించారు.

ముహూర్తాలు తక్కువే...

ఈ యేడాది వివాహ ముహూర్తాలు తక్కువగానే ఉన్నాయని పురోహి తులు చెబుతున్నారు. మాఘ మాసం ప్రారంభమవుతున్న ఈనెల 11వ తేది నుంచి శ్రీకోధ నామ సంవత్సర చైత్ర మాసం వరకూ అంటే ఏప్రిల్‌ 26వ తేదీ వరకు మూడు నెలల్లో కేవలం సుమారు 30 వివాహ ముహూ ర్తాలు మాత్రమే ఉన్నాయంటున్నారు. ఏప్రిల్‌ 28వ తేదీ నుంచి మూఢం ప్రారంభం కానుంది. దీంతో వైశాఖం, జ్యేష్ట మాసాల్లో వివాహ ముహూ ర్తాలు లేవని పంచాంగ కర్తలు వివరిస్తున్నారు. ఆ తరువాత ఆషాఢం శూ న్య మాసం కావడంతో శుభకార్యాలకు పనికి రాదని, మళ్లీ శ్రావణ మాసం అంటే ఆగస్టు నుంచి తిరిగి వివాహాలు జరిపించుకోవచ్చని పురోహితులు చెబుతున్నారు. సాధారణంగా ఏటా చైత్ర శుద్ధ నవమి అంటే శ్రీరామ న వమి అనంతరం వివాహాధి శుభకార్యాలు ప్రారంభమవుతాయి. ఆ తరు వాత వైశాఖ మాసం వేసవి కాలం అయినప్పటికీ వివాహాలు ఎక్కువ గా నే ఉన్నాయి. అయితే ఈ సారి వైశాఖ మాసం అంతా మూఢం కావ డం తో వివాహాలన్నీ చైత్రంలో అంటే ఏప్రిల్‌ 26వ తేదీ లోపే జరిగే అవకా శం ఉంది. ఈ మూడు నెలల ముహూర్తాల్లో సుమారు వెయ్యికి పైగా వి వాహాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు.

ఊపందుకోనున్న వ్యాపారాలు...

పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కానుండడంతో జిల్లాలోని ప్రధాన పట్టణాలల్లో పలు వ్యాపారాలు జోరుగా సాగనున్నాయి. షాపింగ్‌ మాల్స్‌, బట్టల దుకా ణాలు, డ్రెస్సెస్‌, జ్యూవెల్లరీ దుకాణాలు, లేడిస్‌ ఎంపోరియంలు, ఫొటో స్టు డియోలు, వీడియో గ్రాఫీ సెంటర్లు, ఫ్రీ వెడ్డింగ్‌ షూట్‌ స్టూడియోలు, ఫం క్షన్‌ హాల్స్‌, క్యాటరింగ్‌ కేంద్రాలు, ఫ్లవర్‌ డెకరేటర్స్‌, వంట మాస్టర్స్‌ ఇలా పలు వ్యాపారాలు పుంజుకోనున్నాయి. ఇప్పటికే ఇందుకు అవసర మైన ఏ ర్పాట్లను వ్యాపారాల నిర్వాహకులు చేసుకున్నారు. ప్రధానంగా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలో బంగారం, వస్త్ర వ్యాపారం ఎక్కువగా ఉంటుంది. దే శంలో వివిధ ప్రాంతాల నుంచి నూతన డిజైన్లతో కూడిన వస్త్రాలను వ్యా పారులు తీసుకవచ్చి తమ దుకాణాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచారు. వినియోగదారులను ఆకర్శించడానికి డిస్కౌంట్‌లు, ఇతర బహుమతులను అందించడానికి ప్రయత్నిస్తున్నారు. వివాహాల సీజన్‌లో జిల్లా మొత్తంగా రోజుకు రూ. కోటి నుంచి రూ. మూడు కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Updated Date - Feb 07 , 2024 | 12:57 AM