Share News

ఆకతాయిలపై చర్యలు తీసుకుంటాం

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:16 AM

ఆరోగ్య ఉపకేంద్రాన్ని అపరిశుభ్రం చేస్తూ తాగునీటి పైపులను ధ్వంసం చేస్తున్న ఆకతాయిలపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాదికారి సుమన్‌మోహన్‌రావు హెచ్చరించారు. వీర్నపల్లి మండలం గర్జనపల్లి ఆరోగ్య ఉపకేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఆకతాయిలపై చర్యలు తీసుకుంటాం
సిబ్బందితో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో సుమన్‌రావు

జిల్లా వైద్యాదికారి సుమన్‌మోహన్‌రావు

వీర్నపల్లి, ఏప్రిల్‌ 18: ఆరోగ్య ఉపకేంద్రాన్ని అపరిశుభ్రం చేస్తూ తాగునీటి పైపులను ధ్వంసం చేస్తున్న ఆకతాయిలపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాదికారి సుమన్‌మోహన్‌రావు హెచ్చరించారు. వీర్నపల్లి మండలం గర్జనపల్లి ఆరోగ్య ఉపకేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడికి చేరుకున్న ఆయనకు ధ్వంసమైన పైపులు, పగిలిన మద్యం సీసాలు కనిపించడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ శివారులో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రం వద్ద ఆకతాయిలు ప్రతిరోజు మద్యం తాగుతూ సీసాలను పగులగొడుతున్నారని, సిబ్బంది జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో మెరుగైన వైద్యం అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రజలు అపరిశుభ్రం చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆరోగ్య ఉపకేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మద్యం తాగుతూ అపరిశుభ్రపరుస్తున్న ఆకతాయిలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం అక్కడికి చేరుకున్న ఆశావర్కర్లను గ్రామాల్లో అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించారు. సిబ్బంది ప్రభుత్వం అందించే మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను వెంట ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట మండల వైద్యాధికారి చిరంజీవి, ఏఎన్‌ఎమ్‌ మంజుల, ఆశావర్కర్లు ఉన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:16 AM