Share News

కార్మికుల సొంతింటి కల సాకారం చేస్తాం

ABN , Publish Date - May 03 , 2024 | 12:06 AM

కార్మికుల సొంతంటి కలను సాకారం చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.

కార్మికుల సొంతింటి కల సాకారం చేస్తాం

రామగిరి, మే 2: కార్మికుల సొంతంటి కలను సాకారం చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గురువారం సింగరేణి సంస్థ ఆర్జీ-3 డివిజన్‌ పరిధిలోని ఓసీపీ-2లో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ఎన్నికల ప్రచా రంలో భాగంగా ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో ఆయనకు మద్దతుగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. సింగరేణి ప్రాం తంలో అనుబంధ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో పెద్దఎత్తున ఉపాధి కార్యక్రమా లను చేపడుతామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కాకుండ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారెంటి హమీలను నేరవేరుస్తామని పేర్కోన్నారు. అనంతరం మండ లంలోని రత్నాపూర్‌ రామగిరి ఖిల్లా ప్రాంతంలో పనిచేసే ఉపాధిహామీ కూలీలను స్వయంగా కలిసి వంశీకృష్ణను గెలి పించాల్సిందిగా అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గోన్నారు.

Updated Date - May 03 , 2024 | 12:06 AM