Share News

భూములు కోల్పోతున్నవారికి అండగా ఉంటాం

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:08 AM

నేషనల్‌ హైవే రోడ్డు విస్తరణలో భూము లు కోల్పోతున్నవారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కు మార్‌ భాదితులకు భరోసా కల్పించారు.

భూములు కోల్పోతున్నవారికి అండగా ఉంటాం
పరిశీలిస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌

జగిత్యాలరూరల్‌, ఏప్రిల్‌ 17: నేషనల్‌ హైవే రోడ్డు విస్తరణలో భూము లు కోల్పోతున్నవారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కు మార్‌ భాదితులకు భరోసా కల్పించారు. జగిత్యాల రూరల్‌ మండలం అంతర్గాంలో నేషనల్‌ హైవే రోడ్డు విస్తరణలో కోల్పోతున్న భూములను ఎమ్మెల్యే బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అంతర్గాం నుంచి జాతీయ రహదారి 563 నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా వారు సర్వే చేశారన్నారు. గ్రామంలో 45 పైగా ఇళ్లు, 100 మందిపైన రైతులు భూమి కోల్పోయే అవకాశం ఉందన్నారు. గ్రామం పక్క నుంచే నేషనల్‌ హైవే వెళ్తున్నందున జగిత్యాల, మేడిపెల్లి, మల్యాల, కొండగట్టు వరకు రద్దీ ఉండడం వల్ల అంతర్గాం వద్ద ప్లై ఓవర్‌ ఏర్పాటు చేయాలని, అండర్‌పాస్‌లు నిర్మించాలన్నారు. రీ సర్వే చేసి 100 ఫీట్లు మించకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ నారాయణ, నక్కల రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:08 AM